Share News

అమరజీవికి ఘన నివాళి

ABN , Publish Date - Dec 16 , 2025 | 01:26 AM

అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహిం చారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు ప్రజాప్రతిని ధులు, అధికారులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అమరజీవికి ఘన నివాళి
ఒంగోలులో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి స్వామి

జిల్లావ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి

ఒంగోలులో పాల్గొన్న మంత్రి స్వామి, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

ఒంగోలు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి) : అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహిం చారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు ప్రజాప్రతిని ధులు, అధికారులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పా టు కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగం, మరోవైపు ఇతర పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఒంగోలులోని సీవీఎన్‌ రీడింగ్‌ రూం సెంటర్‌ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అమరావతిలో 55 అడుగుల అమరజీవి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్యేలు బీఎన్‌ విజయ్‌కుమార్‌, ముత్తుముల అశోక్‌రెడ్డి, ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కనిగిరిలో జరిగిన కార్యక్రమంలో అక్కడి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పాల్గొని అమరజీవికి నివాళులర్పించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు, ప్రకాశం భవన్‌లోని మీ కోసం హాలులో జేసీ గోపాలకృష్ణ, డీఆర్వో చినఓబులేశు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర చోట్ల వివిధ రాజకీయ పార్టీలు, ఆర్యవైశ్య, ప్రజాసంఘాల సంఘాల ఆధ్వర్యంలో అమరజీవి వర్థంతిని నిర్వహించారు.

Updated Date - Dec 16 , 2025 | 01:26 AM