Share News

గుర్రం జాషువాకు నివాళి

ABN , Publish Date - Sep 28 , 2025 | 10:48 PM

మహాకవి గుర్రం జాషువా అని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అ న్నారు. తెలుగు కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాషువా పద్యాలను గుర్తుచేశారు.

గుర్రం జాషువాకు నివాళి
జాషువా విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న ఎరిక్షన్‌బాబు, టీడీపీ నాయకులు

ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : మహాకవి గుర్రం జాషువా అని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అ న్నారు. తెలుగు కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాషువా పద్యాలను గుర్తుచేశారు. ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, తోట మహెష్‌, వేగినాటి శ్రీను, పి మల్లిఖార్జునరావు, గోవింద్‌, చెవుల అంజయ్య, చేదూరి లక్ష్ముయ్య, సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : విశ్వకవి గుర్రం జాషువా అని మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం గుర్రం జాషువా జయంతి సందర్భంగా జాషువా చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలయ్య మాట్లాడుతూ వడగాడ్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం అన్న నవయువ కవి జాషువా అని కొనియాడారు. కార్యక్రమంలో గుర్రం బాబూరావు, మార్కెట్‌యార్డు డైరెక్టర్‌ కత్తి అన్నోజీరావు, వినుకొండ మమతచిన్ని, గుర్రం డానియేల్‌, పందీటి రజనికుమార్‌, గుర్రం సుధీర్‌బాబు, ఏబు, పెరికె జయరావ్‌, పరదేశి రాజశేఖర్‌, బొప్పూరి ప్రసాద్‌ పాల్గొన్నారు.

మార్కాపురం వన్‌టౌన్‌ : కవి గుర్రం జాషువా జయంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బీసీ భవన్‌లో బీసీ సంఘ నాయకులు జాషువా చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పిన్నిక లక్ష్మీప్రసాద్‌, రంగస్వామి గౌడ్‌, శ్రీనివాస్‌, పురుషోత్తం, గుమ్మా గంగరాజు పాల్గొన్నారు.

పొదిలి : గుర్రం జాషువా జయంతిని కవి పావులూరి మల్లికార్జురావు అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఎ్‌సఎన్‌ కాలేజీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు గోవిందయ్య జాషువా పద్యాలు, రచనలు గొప్పవన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మల్లికార్జునరావు, బుర్రి శ్రీనివాసులు, చావలి ముళీకృష్ణ, సీతారామయ్య, బుజ్జిబాబు, వెంకటేశ్వర్లు, విజయగోపాల్‌, వంశీ, మోన్‌క్రిష్ణ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 10:48 PM