Share News

వైద్య విద్యార్థి యగ్నేష్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , Publish Date - May 02 , 2025 | 12:15 AM

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన ఒంగోలుకు చెందిన వైద్య విద్యార్ధి గుర్రం యగ్నేష్‌ అంత్యక్రియలు గురువారం నగరంలో జరిగాయి.

వైద్య విద్యార్థి యగ్నేష్‌కు కన్నీటి వీడ్కోలు

ఒంగోలు కార్పొరేషన్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన ఒంగోలుకు చెందిన వైద్య విద్యార్ధి గుర్రం యగ్నేష్‌ అంత్యక్రియలు గురువారం నగరంలో జరిగాయి. స్థానిక భా గ్యనగర్‌ 3వలైనులోని ఆరో అడ్డరోడ్డులో నివసించే యగ్నేష్‌ నెల్లూరులోని నారా యణ మెడికల్‌ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా బుధ వారం తన స్నేహితుడు చక్రధర్‌ సోదరి నిశ్చితార్థానికి వెళ్ళి వస్తూ ప్రమాదవ శాత్తు జరిగిన కారు ప్రమాదంలో యగ్నేష్‌ మృతి చెందాడు. ఈ సందర్భంగా బంధువులు, కాలేజీ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో విచ్చేసి నివాలులర్పిం చారు. ఇంటికి పెద్ద కొడుకు అయిన యగ్నేష్‌ చిన్న వయసులోనే మరణించడం తో వారి కుటుంబం, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. మరో రెండేళ్ళలో చ దువు పూర్తి చేసుకుని డాక్టర్‌ అవుతాడని ఆశపడిన తల్లిదండ్రులను ఓదార్చ డం అక్కడున్నవారికి సాధ్యపడలేదు. అనంతరం యగ్నేష్‌ అంతిమయాత్ర ని ర్వహించి స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - May 02 , 2025 | 12:15 AM