Share News

కీచక టీచర్‌కు బుద్ధిచెప్పారు

ABN , Publish Date - Nov 27 , 2025 | 02:15 AM

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యా యుడికి తల్లిదండ్రులు తగిన బుద్ధిచెప్పిన ఘటన మండలంలోని బి.నిడమానూరు గ్రామంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హైస్కూల్‌ ప్లస్‌ మహిళా కళాశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

కీచక టీచర్‌కు బుద్ధిచెప్పారు

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన

ఆయన్ను చితకబాదిన తల్లిదండ్రులు

ఇక నుంచి కాలేజీకి రావద్దని హెచ్చరిక

బి.నిడమానూరులో ఘటన

నాగులుప్పలపాడు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యా యుడికి తల్లిదండ్రులు తగిన బుద్ధిచెప్పిన ఘటన మండలంలోని బి.నిడమానూరు గ్రామంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హైస్కూల్‌ ప్లస్‌ మహిళా కళాశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థినులు ఐదుగురు, ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 13మంది చదువుతున్నారు. సదరు కళాశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు కొద్దిరోజుల నుంచి తన పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్నాడని ఓ విద్యార్థిని తల్లికి ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో సదరు ఉపాధ్యాయుడిని నిలదీసేందుకు మంగళవారం విద్యార్థిని తల్లిండ్రులు, బంధువులు కళాశాలకు వెళ్లగా అతను విధులకు రాలేదు. దీంతో పెద్దమనుషులు, తల్లిదండ్రులు పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాసరావు సమక్షంలో బుధవారం కళాశాల వద్దకు అతనిని పిలిపించారు. అందరి సమక్షంలో ఆ టీచర్‌ను నిలదీయడంతో ఫిర్యాదు చేసిన బాలికతోపాటు మరికొందరు విద్యార్థినులు సైతం తమతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, స్థానికులు ఆ ఉపాధ్యాయుడిని చితకబాదినట్లు సమాచారం. ఆతర్వాత బాధిత విద్యార్థినులకుఆ ఉపాధ్యాయుడితో క్షమాపణలు చెప్పించడంతోపాటు ఇకపై కళాశాలకు రావద్దని హెచ్చరించి పంపించినట్లు తెలిసింది. జరిగిన ఘటనపై విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ రజియాసుల్తానా తెలిపారు.

Updated Date - Nov 27 , 2025 | 02:15 AM