టీడీపీలో కార్యకర్తలకు సముచిత స్థానం
ABN , Publish Date - May 07 , 2025 | 11:36 PM
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కు సముచిత స్థా నం ఉంటుందని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అ న్నారు. మండలంలోని దేవరాజుగట్టులోని ప్రైవేటు కళాశాలలో మండలంలో టీడీపీ అనుబంధ సంఘాల కమిటీ ఎంపిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
ఎరిక్షన్‌బాబు
పెద్దారవీడు, మే 7 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కు సముచిత స్థా నం ఉంటుందని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అ న్నారు. మండలంలోని దేవరాజుగట్టులోని ప్రైవేటు కళాశాలలో మండలంలో టీడీపీ అనుబంధ సంఘాల కమిటీ ఎంపిక కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కా ర్యకర్తలు ప్రభుత్వం అమలు చే స్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించాలన్నారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలతో రాష్ట్రం దివాళా తీసిన సంగతిని ప్రజలకు వివరించి, టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు గొట్టం శ్రీనివాసులరెడ్డి, చంద్రగుం ట్ల నాగేశ్వరరావు, గుమ్మా గంగరాజు, జడ్డా రవి, ఇజ్రాయిల్, ఆనెకాళ్ల శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.