ఎస్పీ దామోదర్‌కు ఘనవీడ్కోలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:12 PM
జిల్లాలో 14 నెలలు ఎస్పీగా పనిచేసి బదిలీపై విజయనగరం జిల్లా వెళుతున్న ఏఆర్ దామోదర్‌కు పోలీసు శాఖ తరఫున ఘనంగా వీడ్కోలు పలికారు.
ఒంగోలుక్రైం, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 14 నెలలు ఎస్పీగా పనిచేసి బదిలీపై విజయనగరం జిల్లా వెళుతున్న ఏఆర్ దామోదర్‌కు పోలీసు శాఖ తరఫున ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత వీడ్కోలు పరేడ్ నిర్వహించి ఓపెన్ టాప్ జీప్‌పై ఊరేగించారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీసు అధికారులు, నగర ప్రజలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ తాను పనిచేసిన కాలంలో సహకారం అందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.