ప్లాస్టిక్ రహిత ఆంధ్ర అందరి లక్ష్యం కావాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:54 PM
ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలో శనివారం మంత్రి స్వామితోపాటు కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తరిమేద్దాం
మంత్రి స్వామి
మార్కాపురంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర కార్యక్రమం
మార్కాపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ అందరి లక్ష్యం కావాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలో శనివారం మంత్రి స్వామితోపాటు కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. తొలుత స్థానిక కూరగాయల మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాపారస్తులతో మాట్లాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, పురప్రముఖులు, ఎన్‌సీసీ విద్యార్థులతో మున్సిపాలిటీ నుంచి గడియారస్థంభం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్రజలు వినియోగించవద్దని కోరారు. కార్యక్రమాల్లో మార్కాపురం సబ్‌కలెక్టర్ సహదిత్ వెంకట్‌త్రివినాగ్, జడ్పీ సీఈవో చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, తహసీల్దార్ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కంభం, : ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించి స్వ చ్ఛాంధ్ర - స్వచ్ఛ సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల స్పెషల్ ఆఫీసర్ విక్టర్ ఇమ్మానియేలు తెలిపారు. ఎంపీడీవో వీరభద్రాచారి ఆధ్వర్యంలో అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం కందులాపురం సెం టర్‌లో ప్రతిజ్ఞ చేశారు.
బేస్తవారపేట : స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా బేస్తవారపేటలో శనివారం అవగాహన ర్యాలీ ని ర్వహించారు. బేస్తవారపేట గ్రామ పం చాయతీలో ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ వ్యర్థాల అవగాహన కల్పిస్తూ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎం పీడీవో ఏవీ రంగనాయకులు, తహసీల్దార్ జితేంద్ర, పంచాయతీ కార్యదర్శులు, సచివాల సిబ్బంది, అంగన్‌వాడీ, వెలుగు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పేదరికం నిర్మూలనే ధ్యేయం
దోర్నాల : పేదరిక నిర్మూలనే ధ్యే యంగా పీ-4 విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టారని ఎరిక్షన్‌బాబు అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండల అధికారులు శనివారం ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎరిక్షన్‌బాబు హాజరయ్యారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఎన్నో అనర్థాలను తెచ్చే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. పర్యావరణం కలుషితమై వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని తద్వారా అతివృష్టి, అనావృష్టి ఏర్ప డుతోందన్నారు. పీ4లో భాంగా ఆర్థికంగా బాగా ఉన్నవారు పేదవారిని దత్తత తీసుకొని వారి అభివృద్ధికి చేయూతనం దించాలని ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచి చిత్తూరి హారిక, ఎంపీడీవో నాసర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివ కోటేశ్వరరావు, టీడీపీ నాయ కులు పాల్గొన్నారు.