Share News

జిల్లాలో ఒక మోస్తరు వర్షం

ABN , Publish Date - Sep 18 , 2025 | 02:18 AM

జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో మొదలైంది. పిడుగుల శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో భారీవర్షం కురిసింది.

జిల్లాలో ఒక మోస్తరు వర్షం

ఉదయాన్నే ఉరుములు, మెరుపులతో మొదలు

ఒంగోలు జలమయం

ఇబ్బందులు పడ్డ ప్రజానీకం

పంటలకు మేలు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 17 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురిసింది. బుధవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో మొదలైంది. పిడుగుల శబ్దాలతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో భారీవర్షం కురిసింది. రోడ్లన్నీ నీటితో నిండి చెరువులను తలపించాయి. గంటపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో 14.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పుల్లలచెరువు మండలంలో 118.4 మి.మీ కురిసింది. అత్యల్పంగా కురిచేడు మండలంలో 4.2 మి.మీ నమోదైంది. పొదిలి మండలంలో 68.6, పొన్నలూరులో 50.6, పామూరులో 41.4, దర్శిలో 38.4, కొనకనమిట్లలో 36.0, ఒంగోలు రూరల్‌లో 25.4, ఒంగోలు అర్బన్‌లో 25.4, మద్దిపాడులో 23.2 మి.మీ కురిసింది. హను మంతునిపాడు మండలంలో 23.0, తాళ్లూరులో 22.2, సీఎస్‌పురంలో 21.6, చీమకుర్తిలో 18.4, సంతనూతలపాడులో 12.4, బేస్తవారపేటలో 11.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో నాలుగైదు మండలాల్లో కొద్దిపాటి జల్లులు పడ్డాయి. తాజా వర్షంతో పంటలకు మేలు చేకూరనుంది. గత వారం పది రోజులుగా ఎండ తీవ్రతతోపాటు ఉక్కపోతతో ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వర్షంతో కొంత ఉపశమనం కలిగింది.

Updated Date - Sep 18 , 2025 | 02:18 AM