Share News

పేదలకు ఆపన్నహస్తం

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:40 PM

అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 63 మందికి రూ.43,80,714 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

పేదలకు ఆపన్నహస్తం
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

63 మందికి రూ.43.80లక్షలు అందజేత

గిద్దలూరు టౌన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆపన్న హస్తమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 63 మందికి రూ.43,80,714 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చన్నారు. వారికి అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పొందవచ్చన్నారు. అనారోగ్య సమస్యలతో అనేక మంది పేదలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా నిలువాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలోని 710 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6,28,25,619 పంపిణీ చే శామన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కంభం మార్కెట్‌యార్డు చైర్మన్‌ పూనూరి భూపాల్‌రెడ్డి, పట్టణ, మండల పార్టీల అధ్యక్షులు సయ్యద్‌ షానేషావలి, మార్తాల సుబ్బారెడ్డి, రాచర్ల మండలపార్టీ అధ్యక్షులు కటికె యోగానంద్‌ పాల్గొన్నారు.

దిత్వా తుఫాన్‌ పట్ల అప్రమత్తం - ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

నియోజకవర్గ ప్రజలు దిత్వా తుఫాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అన్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధంగా ఉందన్నారు. మొంథా తుఫాన్‌ అధికారుల సహాయంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దిత్వా తుఫాన్‌ను కూడా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు అధైర్యపడవద్దని అశోక్‌రెడ్డి అన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 10:40 PM