విధ్వంసక పాలనకు సమాధి .. ప్రజాపాలనకు ఏడాది
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:41 PM
కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రజాపాలనలో ఏడాది కాలంలోనే ఎన్నో అద్భుతాలు సాధించిందని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శిలోని గడియారస్తంభం సెంటర్‌లో ఆమె కేకు కట్ చేశారు. ఎన్టీఆర్, దివంగత మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు
దర్శిలో కేక్ కట్ చేసి సంబరాలు
దర్శి, జూన్ 4(ఆంధ్రజ్యోతి): కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రజాపాలనలో ఏడాది కాలంలోనే ఎన్నో అద్భుతాలు సాధించిందని టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శిలోని గడియారస్తంభం సెంటర్‌లో ఆమె కేకు కట్ చేశారు. ఎన్టీఆర్, దివంగత మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు గతంలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలను 70శాతంకు పైగా అమలు చేసిందన్నారు. వైసీపీ పాలకులు 10 శాతం హామీలను కూడా పూర్తి చేయలేదన్నారు. ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్ వెన్నుపోటు దినం నిర్వహించటం సిగ్గుచేటన్నారు. నా ఎస్సీ, నా బీసీ అంటూ దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టిన 27 పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. విధ్వంస పాలనకు ప్రజలు సమాధికట్టి ప్రజాపాలనను అధికారంలోకి తేవటంతో అందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టీడీపీ దర్శి నియోజకవర్గ నాయకులు డాక్టర్ కడియాల లలిత్‌సాగర్, దర్శి ఏఎంసీ చైర్మెన్ దారం నాగవేణి, సుబ్బారావు, టీడీపీ దర్శి పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, రూరల్ అధ్యక్షుడు మారెళ్ల వెంకటే శ్వర్లు, మాజీ ఎంపీపీ ఫణిదపు వెంకటరామయ్య, తెలుగు మహిళా నాయకురాలు ఎం. శోభారాణి, దర్శి పట్టణ క్లష్టర్ ఇన్‌చార్జి నారపుశెట్టి మధు, టీడీపీ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, దామా కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.