Share News

ఎన్టీఆర్‌కు ఘన నివాళి

ABN , Publish Date - May 29 , 2025 | 01:47 AM

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావుకు విభిన్న వర్గాల ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అన్నివర్గాల వారు కృషిచేయాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతులను సాధారణంగా పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు నిర్వహిస్తుంటాయి.

ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ఒంగోలులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, టీడీపీ నేతలు

జిల్లావ్యాప్తంగా జయంతి వేడుకలు

ఈసారి ప్రభుత్వపరంగా కూడా నిర్వహణ

ఆయన స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడాలని పలువురు పిలుపు

ఒంగోలు మే 28 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీరామారావుకు విభిన్న వర్గాల ప్రజలు ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి అన్నివర్గాల వారు కృషిచేయాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతులను సాధారణంగా పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు నిర్వహిస్తుంటాయి. ఈసారి జయంతి వేడుకలను ప్రభుత్వపరంగా కూడా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బుధవారం జిల్లావ్యాప్తంగా ఒకవైపు అధికార యంత్రాంగం, మరోవైపు టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఈ వేడుకలను నిర్వహించి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించా రు. ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి కలెక్టర్‌ తమీమ్‌ అన్సారి యా, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ, ఇతర అధికారులు, ఇటీవల పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా నియమితులైన డాక్టర్‌ కె.సీతారామయ్య, టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ నేతృత్వంలో పోలీస్‌ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో జయంతి కార్యక్రవలుఉ జరిగాయి. మరోవైపు టీడీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు కడపలో జరుగుతున్న పార్టీ మహానాడుకు హాజరు కాగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్‌ అభిమానులు ఈ వేడుకలను నిర్వహించారు. ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ డాక్టర్‌ మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించాయి. అలాగే పలు పట్టణాలు, వందలాది గ్రామాల్లో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా నిర్వహించారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతిక అయిన ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాష్ట్ర, జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

Updated Date - May 30 , 2025 | 03:06 PM