Share News

ఆంధ్రకేసరికి ఘన నివాళి

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:32 AM

ఆంరఽధకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. ఆ మహనీయుని విగ్రహాలు, చిత్రపటాలకు పలు రంగాల వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకవైపు ప్రభుత్వపరంగా అధికార యంత్రాంగం, మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.

ఆంధ్రకేసరికి ఘన నివాళి
ఒంగోలులో ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి స్వామి

జిల్లావ్యాప్తంగా జయంతి వేడుకలు

ఒంగోలు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : ఆంరఽధకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. ఆ మహనీయుని విగ్రహాలు, చిత్రపటాలకు పలు రంగాల వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒకవైపు ప్రభుత్వపరంగా అధికార యంత్రాంగం, మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం వద్ద జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి డాక్టర్‌ స్వామి పాల్గొన్నారు. తొలుత ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని లాయర్‌పేట రైతుబజారు, సీవీఎన్‌ రీడింగ్‌ సెంటర్‌లో ఉన్న విగ్రహాల వద్ద పలుసంస్థల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. ప్రకాశం పంతులు స్వగ్రామమైన వినోదరాయునిపాలెంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ పాల్గొన్నారు. ఒంగోలు రూరల్‌ మండలం దేవరంపాడులోని విజయ స్థూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జేసీ గోపాలకృష్ణ హాజరయ్యారు. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొని ప్రకాశం పంతులుకు ఘనంగా నివాళులర్పించారు. అలాగే జిల్లాలోని పలుప్రాంతాల్లో విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాల్లో జయంతి వేడుకలు జరిగాయి. స్వాతంత్య్రం కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాలను, ఆయన నిరాడంబరతను ఈ సందర్భంగా ప్రముఖులు కొనియాడారు.

Updated Date - Aug 24 , 2025 | 01:32 AM