Share News

అల్లూరికి ఘన నివాళి

ABN , Publish Date - May 07 , 2025 | 11:35 PM

రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం అ ల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

అల్లూరికి ఘన నివాళి
అల్లూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. బుధవారం అ ల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు షానేషావలి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ దుత్తా బాలీశ్వరయ్య, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాడి రైతులకు ప్రభుత్వం చేయూత

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని సంజీవరాయునిపేట గ్రామంలో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువుల దానాను పోషకులకు పంపిణీ చేశారు. ఈసందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని రైతుల సంక్షేమానికి కట్టుబడి అనేక సబ్సిడీ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో పాల ఉత్పత్తులు తగ్గకూడదన్న ఉద్దేశంతో పాడి పశువులకు అవసరమైన దానా 50శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పశుసంవర్థక వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రావన్‌, ఏడీ యోగానంద్‌, ఏవో భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ నాయబ్‌రసూల్‌, జడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్‌యాదవ్‌, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ రామసుబ్బయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు బైలడుగు బాలయ్య, నంది శ్రీను, సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:35 PM