చీమకుర్తిలో వైభవంగా కోటి దీపోత్సవం
ABN , Publish Date - Nov 17 , 2025 | 10:56 PM
చీమకుర్తి పట్టణంలో సాక్షిరామలింగేశ్వరాలయలో కార్తీక సోమవారం సందర్భంగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
చీమకుర్తి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి) : చీమకుర్తి పట్టణంలో సాక్షిరామలింగేశ్వరాలయలో కార్తీక సోమవారం సందర్భంగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని దీపాలు వెలిగించి పూజలు చేశారు. పరమశివుని చిత్రం చుట్టూ చేసిన దీపాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. మండల పరిధిలోని అన్ని శివాలయాల్లో చివరి కార్తీక సోమవారం నాడు విశేషంగా పూజలు జరిపారు.