వైభవంగా పట్టాభిరాముని వార్షికోత్సవం
ABN , Publish Date - May 05 , 2025 | 10:11 PM
బేస్తవారపేట మండలంలోని జేసీ అగ్రహారం గ్రామంలో శ్రీ పట్టాభిరామ స్వామి 9వ వార్షికోత్సవం వైభవంగా జరుగుతోంది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
బేస్తవారపేట, మే 5 (ఆంధ్రజ్యోతి) : బేస్తవారపేట మండలంలోని జేసీ అగ్రహారం గ్రామంలో శ్రీ పట్టాభిరామ స్వామి 9వ వార్షికోత్సవం వైభవంగా జరుగుతోంది. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను అశోక్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షుడు సోరెడ్డి మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పూనూరు భూపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, ఏ ఇంద్రసేనారెడ్డి, రామకోటయ్య, గంగయ్య యాదవ్ పాల్గొన్నారు.