శింగరకొండలో వైభవంగా గిరి ప్రదక్షిణ
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:46 AM
శింగరకొండలో ఆదివారం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
అద్దంకి : శింగరకొండలో ఆదివారం లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. శింగరకొండలోని మెట్ల మార్గం వద్ద ఈవో మద్దినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ శింగరకొండలోని మెట్ల మార్గం వద్ద ప్రారంభమై 99 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, గోపాలపురం, భవనాసి చెరువు మీదుగా సుమారు 3 కి.మీ దూరం సాగింది. అనంతరం మెట్ల మార్గంలో 300 మెట్లు ఎక్కి లక్ష్మీనరశింహస్వామి దేవాల యానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాసరావు, ఆలయసిబ్బంది, రమాసుందరి ఆద్వర్యంలో పలువురు మహిళాభక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షణ లో పాల్గొన్నారు. ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షణ నిర్వహించనున్నట్లు ఈఓ శ్రీనివాస రావు తెలిపారు.
అద్దంకి : శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం లక్ష తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించారు. ప్రాతఃకాల సుప్రభాతం, గోపూజ, బిందెతీర్ధం అనంతరం స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు, ఉభయదాతలు వేదస్వస్తి, మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షణ చేశారు. ఐదు ఆవృత్తాలుగా వేదపండితులు, అర్చకులు లక్ష తమలపాకులతో స్వామి వారికి పూజ నిర్వహించారు. స్వామి వారికి మహానివేదన, పంచహారతులు నిర్వహించారు. ఉభయదాత లుగా గుంటూరుకు చెందిన న్యూమార్నింగ్ స్టార్ ట్రావెల్స్ అధినేత పొనకాల శ్రీనివాసరావు, యశోద దంపతులు పాల్గొన్నారు.