రాములోరికి వైభవంగా రథోత్సవం
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:47 AM
మండలం లోని తిమ్మాపురం, ఐనముక్కుల గ్రామాల్లో గురు వారం రాములవారి రథోత్సవం వైభోపేతంగా నిర్వ హించారు.

పెద్దదోర్నాల, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): మండలం లోని తిమ్మాపురం, ఐనముక్కుల గ్రామాల్లో గురు వారం రాములవారి రథోత్సవం వైభోపేతంగా నిర్వ హించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహి స్తున్న ఉత్సవాలలో భాగంగా ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు రామయ్యస్వామి, కాకర్ల లక్ష్మీప్రసాద్ శర్మ పర్యవేక్షణలో శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమంతులకు ప్రత్యేక అలంకరణలు పూజలు చేశారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలతో పాటు పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. అనం తరం వడపప్పు, పానకం పంపిణీచేశారు. సాయం త్రం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రథంపై సీతారామలక్ష్మణ సహిత హనుమంతుల ఉత్సవమూ ర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో బొగ్గరపు రమేష్, పెరుమాళ్ల సుబ్బారావు, దొడ్డావెంకటేశ్వర్లు, డి.వెంకటసుబ్బయ్య, మిరియాల నారాయణ, మండ్ల వెంకటసుబ్బయ్య, రాములు, చిట్ట్యాల రామకృష్ణారెడ్డి, జంగిలి పిచ్చయ్య, యక్కంటి లింగారెడ్డి, గొల్మారు శేఖర్‌రెడ్డి, పీ రామిరెడ్డి, మల్లారెడ్డి, ఆదినారాయణ, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి ప్రతిష్ఠ మహోత్సవాలు
గిద్దలూరు: మండలంలోని సంజీవరాయునిపేట గ్రామంలో నిర్మించిన గణపతి, సుబ్రమణ్య, నవగ్రహ, ధ్వజసహిత కాశీవిశాలాక్షి సమేత మరకతలింగ కాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహిస్తు న్నట్లు వంశపారంపర్య ధర్మకర్త సూరె చిన్నపీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 12న ప్రత్యేక పూజలు, అభి షేకాలు, 13న విగ్రహాల గ్రామోత్సవం, రుద్రాభిషేకం, 14న హోమాలు, విగ్రహ ప్రతిష్ఠ, మధ్యా హ్నం అన్నదానం, సాయంత్రం శాంతికళ్యాణ మహోత్సవం, అనం తరం గ్రామోత్సవం నిర్వహిస్తున్నా మన్నారు. ప్రతిష్ఠ జరిగే మూడు రోజులు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం
మార్కాపురం : శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవా లు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఏర్పాట్ల పై అన్ని శాఖల అధికారులతో శుక్రవారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గొల మారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొంటారన్నారు.
బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత
200 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు
రాచర్ల (గిద్దలూరు) : రాచర్ల మండలం జేపీ.చెరువు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీనెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానంలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రూరల్ సీఐ రామకోటయ్య, ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. రాచర్ల పోలీసుస్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ, ఎస్సైలు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భం గా 200 మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కల్యాణం తరువాత అక్షితల కోసం భక్తులు ఎగబడి న సందర్భాలను పురస్కరించు కుని ఇక మీదట అలా జరుగ కుండా బారీకేట్లు ఏర్పాటు చేసి క్యూ పద్దతిలో అక్షింతలు అంద చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. నీటిగుండంలో స్నానం ఆచరించే విషయంలో కూడా నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాచర్ల మీదుగా, అంబవరం మీదుగా బ్రహ్మోత్సవాలకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడి నుండి దేవస్థానం వరకు వెళ్లేందుకు వీలుగా భక్తులందరికీ ఉచిత ఆటో సౌకర్యం కల్పించామన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఆటోలను సమకూరుస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్స వాలు విజయవంతంగా, ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు భక్తులు సహకరించాలని రూరల్ సీఐ రామకోటయ్య, ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు.