మృత్యువులోనూ వీడని స్నేహబంధం
ABN , Publish Date - Aug 17 , 2025 | 01:58 AM
ఆత్మీయ మిత్రులైన ఆ ఇద్దరూ మరణంలోనూ ఒకరి వెంట మరొకరు ప్రాణాలు విడిచారు.
పర్చూరు, అగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : ఆత్మీయ మిత్రులైన ఆ ఇద్దరూ మరణంలోనూ ఒకరి వెంట మరొకరు ప్రాణాలు విడిచారు. ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మరొకరు అతని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక కుప్పకూలి మరణించారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా పర్చూరు ఇందిరా కాలనీలో శనివారం చోటుచేసుకుంది. వాడరేవు - పిడుగురాళ్ల హైవే రోడ్డులోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో వాసిమల్ల సలోమన్ రాజు(43) మృతి చెందా డు. మృతదేమాన్ని పోస్టు మార్టం నిమిత్తం చిలకలూ రిపేట ప్రభుత్వ వైధ్యశా లకు తరలించారు. స్నేహి తుని మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన పాండ్ర నరసయ్య(50) మిత్రుని మరణం జీర్ణించుకోలేక ఒక్కసారిగా కుప్పకూలి వైధ్యశాలలోనే మరణించారు. స్నేహితుడు మరణించి 24 గంటలు గడవక ముందే తనువు చాలించారు. ఈ విషాద ఘటన చూపరులను కన్నీటి పర్యంతం చేసింది. ఇరువురు ఒకే కాలనీకి చెందిన వారు కావడం, అందులోనూ ఒకరి నివాసం పక్కన మరొకరి నివాసం కావడంతో ఇద్దరి మృతదేహాలతో ఇందిరా కాలనీలో విషాదం అలముకుంది. వృతి రీత్య ఇద్దరూ డ్రైవర్‌లుగా జీవనం సాగిస్తున్నారు. సలోమన్ రాజ్‌కు భార్య, కుమారుడు ఉండగా, నరసయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.