Share News

బస్సులో సీటు కోసం ఇరువురి మధ్య గొడవ

ABN , Publish Date - Aug 01 , 2025 | 12:25 AM

ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో ఇరువురు గొడవపడ్డారు. దీంతో ఆటోడ్రైవర్‌ తన బంధువులను పిలిపించుకుని టీచర్‌పై దాడి చేయించాడు.

 బస్సులో సీటు కోసం  ఇరువురి మధ్య గొడవ

టీచర్‌పై దాడి చేసిన యువకులు

పరస్పరం కేసుల నమోదు

ఒంగోలు క్రైం, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో ఇరువురు గొడవపడ్డారు. దీంతో ఆటోడ్రైవర్‌ తన బంధువులను పిలిపించుకుని టీచర్‌పై దాడి చేయించాడు. వివరాలలోకి వెళితే.. ఒంగోలు నగరం బిలాల్‌న గర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ కరిముల్లా అద్దంకిలో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. అదే బస్సులో మద్దిపాడులో టీచర్‌గా పనిచేసే రమేష్‌బాబు ఎక్కాడు. అయితే ము గ్గురు కుర్చునే సీటులో కరిముల్లాతో పాటు మరో వ్వక్తి మాత్రమే కుర్చున్నారు. దీంతో రమేష్‌బాబు వెళ్ళి అక్కడ కూర్చునే ప్రయత్నం చేయగా కరిముల్లా అడ్డుకున్నాడు. కొంచం సర్దుకొండి అంటూ రమేష్‌బాబు అక్కడే కూర్చున్నాడు. దీంతో వారి మధ్య మద్దిపాడు నుంచి గొడవ ప్రారంభమైంది. కరిముల్లా మొచేతితో టీచర్‌ రమేష్‌ బాబును నెడుతూ ఉండగా అదే సమయంలో ఆ యన చేయి కాస్త విసరడంతో కరిముల్లా ముక్కుకు తగిలి రక్తం కారింది. దీంతో కరిముల్లా వెంటనే బిలాల్‌ నగర్‌లో ఉన్న బంధువులకు ఫోన్‌ చేశాడు. పోతురాజుకాలువ వద్దకు బస్సు వచ్చిన తరువాత కరిముల్లా బంధువులు సుమారు 20మంది బస్సు ఎక్కి రమేష్‌బాబుపై పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. అనంతరం కరిముల్లాను 108 వాహనంలో రిమ్స్‌కు వెళ్ళి అక్కడ పోలీ స్‌ అవుట్‌పోస్టులో ఫిర్యాదు చేశారు. . తనపై ఓ ప్రయాణికుడు దాడి చేశాడని పేర్కొన్నారు. అలాగే టీచర్‌ రమేష్‌బాబు ఒంగోలు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై కొంతమంది యువకులు దాడి చేశారని తెలిపారు. ఈమేరకు రెండు కేసులు నమోదు చేస్తున్నట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు.

Updated Date - Aug 01 , 2025 | 12:25 AM