Share News

ఆటో డ్రైవర్లకు పండుగ

ABN , Publish Date - Oct 04 , 2025 | 01:08 AM

ఆటోడ్రైవర్ల కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆటోడైవర్ల సేవలో’ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.15వేలు లబ్ధి అందించనుంది. ఆ మొత్తాన్ని శనివారం నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలో జమచేయనుంది.

ఆటో డ్రైవర్లకు పండుగ

నేడు వారి ఖాతాలలో రూ.15వేలు జమ

ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కార్యక్రమం

ఒంగోలులో పాల్గొననున్న ఇన్‌చార్జి మంత్రి ఆనం

ఎక్కడికక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు

ఒంగోలు క్రైం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఆటోడ్రైవర్ల కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆటోడైవర్ల సేవలో’ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.15వేలు లబ్ధి అందించనుంది. ఆ మొత్తాన్ని శనివారం నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాలో జమచేయనుంది. జిల్లాలో 12,091 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆటోలతో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు.

జిల్లా కేంద్రంలో 500 ఆటోలతో ర్యాలీ

ఒంగోలులో 500 ఆటోలతో ర్యాలీ నిర్వహించేందుకు చర్యలు చేప ట్టారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ప్రకాశం భవన్‌ వరకు ఇది సాగనుంది. ఆతర్వాత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మిగిలిన అన్ని నియోజ కవర్గాలలో ఆటో డ్రైవర్లకు నగదు పంపిణీ కార్యక్రమం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులుగా ఉన్న ఆటోడ్రైవర్ల సంఖ్య గతం కంటే ఈసారి ఎక్కువగా ఉంది. 2023-24లో కేవలం 10,741మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 12,091 మందికి పెరిగింది. అదేక్రమంలో గత ప్రభుత్వంలో రూ.10వేలు ఆటో డ్రైవర్లకు ఇవ్వగా కూటమి ప్రభుత్వం లబ్ధిని రూ.15 వేలకు పెంచడంతో వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది.

నేడు ఇన్‌చార్జి మంత్రి రాక

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం ఒంగోలు రానున్నారు. నగరంలో నిర్వహించే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి బయల్దేరి నెల్లూరు వెళ్తారు.

Updated Date - Oct 04 , 2025 | 01:08 AM