Share News

నిరుపయోగంగా డంపింగ్‌ యార్డు

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:45 PM

మండ లంలోని కెల్లంపల్లి గ్రామంలో డంపింగ్‌ యార్డు నిరు పయోగంగా ఉండటం పట్ల కలెక్టర్‌ తమీమ్‌ అన్సారి యా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండ లంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పెదఉల్లగల్లు గ్రామా లను ఆమె సందర్శించారు.

నిరుపయోగంగా డంపింగ్‌ యార్డు
కెల్లంపల్లిలో డంపింగ్‌ యార్డును సందర్శించి డిప్యూటీ ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆగ్రహం

ముండ్లమూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని కెల్లంపల్లి గ్రామంలో డంపింగ్‌ యార్డు నిరు పయోగంగా ఉండటం పట్ల కలెక్టర్‌ తమీమ్‌ అన్సారి యా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండ లంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పెదఉల్లగల్లు గ్రామా లను ఆమె సందర్శించారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో భా గంగా రెండు గ్రామాల్లో పారిశుధ్యం సరిగా లేదని ఫిర్యాదులు రావటంతో పూరిమెట్ల, కెల్లంపల్లి గ్రామాల ను సందర్శిస్తున్నట్టు చెప్పారు.

కెల్లంపల్లి గ్రామంలో డంపింగ్‌ యార్డును చూసి ఇందులో చెత్తాచెదారాన్ని ఎందుకు వేయటం లేదని, ఎందుకు తనిఖీలు నిర్వహించటం లేదని డిప్యూటీ ఎంపీడీవో జనార్దన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పే సమాధానం సక్రమంగా లేకపోవటంతో అసహ నం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రధాన వీధులను కలెక్టర్‌ సందర్శించి పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓఇంటికి వెళ్ళి పారిశుధ్య పనులు ఎలా చేపడుతున్నారని? అడగ్గా ప్రతి రోజు తడి చెత్త ను పొడి చెత్తను తీసుకువెళ్తున్నారని ఇంటి యజ మానురాలు తెలిపారు. అక్కడే ఉన్న గ్రీన్‌ అంబాసి డర్లను ఏమైనా సమస్యలు ఉన్నాయా? అడగ్గా తమకు జీతాలు తొమ్మిది నెలల నుంచి రావడంలేదన్నారు. తక్ష ణమే పంచాయతీల నుంచి గ్రీన్‌ అండాసిడర్లకు జీతాలు చెల్లించాలని ఎంపీడీవో శ్రీదేవిని ఆదేశించారు. గ్రామానికి చెందిన కుంటా అంజలి తొమ్మిది సంవత్సరా ల దివ్యాంగుడు గణేష్‌ను తీసుకు వచ్చి తమకు నలుగురు పిల్లలని, తన పరిస్థితి బాగోలేదని కన్నీటి పర్యంత మయ్యారు. ఆమె చెల్లించి పోయి వెంటనే తహసీల్దార్‌ లక్ష్మీనారాయణను ఆ కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే డీపీవో రూ.2వేలు, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ రూ.2 వేలు తక్షణ సాయంగా అందించారు. రెండు నెలలకు సరిపడా సరుకులు ఇప్పించాలని తహసీల్దార్‌ లక్ష్మీనారాయణను ఆదేశించారు. అనంతరం పెద ఉల్లగల్లులో డంపింగ్‌ యార్డును పరిశీలించారు.

బెల్టు షాపులు లేకుండా చేయాలంటూ మహిళ మొర

పూరిమెట్లలో బెల్టు షాపులతో కాపురాలు చితికి పోతున్నాయని గ్రామానికి చెందిన ముల్లా విజ యమ్మ కలెక్టర్‌ దృష్టికి తీసుకువ చ్చారు. గ్రామంలో ఎన్ని బెల్టు షా పులు ఉన్నాయని కలెక్టర్‌ అడగ్గా మూడు బెల్టు షాపులను రూ.10 లక్షలకు పాట పాడుకుంటున్నారని తెలిపారు. ఇటీవల బెల్టు షాపుల్లో మద్యం తాగి మురుగు కాలువల్లో పడి ఒక వ్యక్తి మృతి చెందారని తెలిపారు. దీనికితోడు ఉపాధి హామీపథకంలో కూలీలకు రెండు నెలల నుంచి వేతనాలు రాకపోగా గ్రామంలో కొందరు మేట్లు రూ. 200 లంచం అడుగుతున్నారని తెలిపారు. వెంటనే ఆ యా శాఖల అధికారులను పిలిపించి విచారణచేసి చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, జడ్పీ సీఈవో చిరంజీవి, డీపీవో వెంకట నాయుడు, డీఎల్‌పీవో పద్మ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ హనుమాన్‌ బాబు, విద్యుత్‌ ఏఈ టి.చినఅంకబాబు, సర్పంచ్‌లు ఒగులూరి రామాంజీ, జమ్ముల గురవయ్య, జనమాల నాగేంద్ర, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ కోడెగ మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:45 PM