Share News

‘దొనకొండ’లో గృహ నిర్మాణాలకు 940 మంది అర్హులు

ABN , Publish Date - Dec 17 , 2025 | 10:45 PM

పేదల సొంతింటి కలను నెరవేర్చే చర్యల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకం కింద ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టింది.

‘దొనకొండ’లో గృహ నిర్మాణాలకు 940 మంది అర్హులు
సర్వే నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ ఏఈ, సిబ్బంది(ఫైల్‌)

పీఎం గ్రామీణ ఆవాస్‌ యోజన సర్వే వెల్లడి

దొనకొండ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి) : పేదల సొంతింటి కలను నెరవేర్చే చర్యల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సొంతంగా స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకం కింద ఇళ్లు మంజూరుకు చర్యలు చేపట్టింది. నవంబరు 5 నుంచి ఈనెల 14వ తేదీ వరకు గృహ నిర్మాణశాఖ, సచివాలయాల సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా లబ్ధిదారుల సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆరవళ్లిపాడులో 53 మంది, భూమనపల్లిలో 34, చందవరంలో 151, దొనకొండలో 74, గంగదేవిపల్లిలో 64, ఇండ్లచెరువులో 45, కొచ్చెర్లకోటలో 116, మల్లంపేటలో 50, మంగినపూడిలో 33, పీ లక్ష్మీపురంలో 67, పీ వెంకటాపురంలో 17, పెద్దన్నపాలెంలో 34, పోలేపల్లి 65, రామాపురం 36, రుద్రసముద్రం 45, సంగాపురం 23, తెల్లబాడులో 18, వద్దిపాడులో 15 మంది మొత్తం 940 మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. వీరిలో 918 మంది సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంకాగా, 22 మంది తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే నిర్మించుకుంటామని సర్వేలో వెల్లడించినట్లు సమాచారం. లబ్ధిదారులు ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, ఇల్లు కట్టుకునే స్థలం, ఆధార్‌కార్డు, మొబైల్‌ నెంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌ తదితర వివరాలతో లబ్ధిదారులుగా గుర్తిస్తూ ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు.

Updated Date - Dec 17 , 2025 | 10:45 PM