8 మంది డీటీలకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి
ABN , Publish Date - Sep 06 , 2025 | 02:31 AM
ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 8 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారిలో కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిని మన జిల్లాలోనే నియమించారు.
పలువురికి పోస్టింగ్
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 8 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారిలో కొందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురిని మన జిల్లాలోనే నియమించారు. ఇద్దరిని బాపట్లకు, మరో ముగ్గురిని నెల్లూరు జిల్లాకు కేటాయించారు. సంతనూతలపాడు డీటీ రఫిని ఒంగోలు ఆర్డీవో కార్యాలయ ఏవోగా, ఒంగోలు డీటీ కృష్ణమోహన్‌ను త్రిపురాంతకం, ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఎస్‌వీబీ రాజేష్‌ను సింగరాయకొండ తహసీల్దార్‌గా నియమించారు. చీరాలలో పనిచేస్తున్న జి.గీతారాణి, బల్లికురవ డీటీ కె.రవికుమార్‌ను బాపట్ల జిల్లాకు కేటాయించారు. చీమకుర్తి ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇన్‌చార్జి ఎన్.జయలక్ష్మి, సీఎస్‌పురం డీటీ పి.వెంకటేశ్వర్లు, మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టులో పనిచేస్తున్న జె.వేణుగోపాల్‌ను నెల్లూరు జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.