అంగన్‌వాడీలకు 5జీ ఫోన్లు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:35 AM
జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్త లకు శుక్రవారం 5జీ సెల్‌ఫోన్లను అందజే శారు. మొత్తం 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని మూడు వేల మంది అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు శాసనస భ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.
ప్రజాప్రతినిధుల చేతులమీదుగా పంపిణీ
కార్యకర్తలకు ఇక యాప్ కష్టాలు తప్పినట్లే!
ఒంగోలు నగరం, డిసెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్త లకు శుక్రవారం 5జీ సెల్‌ఫోన్లను అందజే శారు. మొత్తం 13 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని మూడు వేల మంది అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు శాసనస భ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. కొండపి ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అందజేశారు. కనిగిరిలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, గిద్దలూరులో అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెంలో ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేశారు. మిగతా ప్రాంతాల్లో నేతలు, అధికారులు అందజేశారు. అంగన్ వాడీ కేంద్రాల్లో సేవలను మెరుగుపర్చ డమే లక్ష్యంగా ప్రభుత్వం పలురకాల యాప్‌ల ద్వారా కార్యకర్తల నుంచి సమాచారం తీసుకుంటోంది. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ల ద్వారా ప్రతి కార్యకర్త నిత్యం కేంద్రంలోని పిల్లల వివరాలు, పౌష్టికాహారం పంపిణీ, ఇతర సర్వేలను ప్రభుత్వానికి యాప్‌ల ద్వారా పంపించాల్సి ఉంది. ఇలా పంపించేందుకు కార్యకర్తల వద్ద ఉన్న 3జీ, 4జీ పాత సెల్‌ఫోన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి. దీంతో తమకు యాప్‌లకు సపోర్టు చేసే ఫోన్లను ఇవ్వాలని అంగన్‌వాడీ కార్యకర్తలు ఎంతోకాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 5జీ ఫోన్లను జిల్లాకు పంపింది. వీటిని శుక్రవారం కార్యకర్తలకు అందజేశారు.