.5.87 కోట్లు స్కూలు గ్రాంటు విడుదల
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:28 PM
జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి రూ.5.87 కోట్లు కాంపోజిట్ స్కూలు గ్రాంటు విడుదలైంది. ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు(పీఏవో) ఈ మొత్తం విడులకు ఆమోదముద్ర వేసింది.
ఇది 50శాతమే
ఒంగోలు విద్య, జూన్ 26 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి రూ.5.87 కోట్లు కాంపోజిట్ స్కూలు గ్రాంటు విడుదలైంది. ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు(పీఏవో) ఈ మొత్తం విడులకు ఆమోదముద్ర వేసింది. జిల్లాలోని 2,295 పాఠశాలలకు ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. ఈ మేరకు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసులు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ప్రస్తుతం తక్షణమే 50శాతం గ్రాంటు అంటే రూ.2.94 కోట్లు పాఠశాలలకు విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. పాఠశాలలకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 50శాతం గ్రాంటులో 20శాతం జూలై 5న నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(ఎంపీటీఎం) ఖర్చులకు వినియోగించుకునేందుకు అనుమతిస్తూ ఎస్‌పీడీ ఉత్తర్వులు జారీ చేశారు. కాంపోజిట్ స్కూలు గ్రాంటు విడుదలకు సంబంధించి ఈనెల 24న జారీచేసిన ఉత్తర్వుల్లో పాఠశాలలకు విడుదలయ్యే 50 శాతం స్కూలు గ్రాంటులో 10 శాతం స్వచ్ఛతా కార్యక్రమాలకు, 10శాతం మెగా పీటీఎం ఖర్చులకు వినియోగించుకోవాలన్నారు. తాజాగా గురువారం జారీచేసిన ఉత్తర్వుల్లో స్వచ్ఛతా కార్యక్రమాలకు వినియోగించే 10శాతం మెగా పీటీఎం ఖర్చులకు వినియోగించుకోమన్నారు.