Share News

474 మందికి ఉద్యోగోన్నతులు

ABN , Publish Date - Jun 05 , 2025 | 01:24 AM

ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 474 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూలు అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతులు లభించనున్నాయి. కొత్తగా పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులు 105 మంజూరు కావడంతో ఎస్‌జీటీలను వాటిలో నియమించేందుకు అవకాశాలు మరింత పెరిగాయి.

474 మందికి ఉద్యోగోన్నతులు
సర్టిఫికెట్‌ల పరిశీలనను పర్యవేక్షిస్తున్న డీఈవో కిరణ్‌కుమార్‌

ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లు, పీఎస్‌ హెచ్‌ఎంలుగా అవకాశం

సర్టిఫికెట్ల పరిశీలన

ఒంగోలు విద్య, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 474 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూలు అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతులు లభించనున్నాయి. కొత్తగా పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులు 105 మంజూరు కావడంతో ఎస్‌జీటీలను వాటిలో నియమించేందుకు అవకాశాలు మరింత పెరిగాయి. జిల్లాలో మిగులుగా తేలిన 509మంది స్కూలు అసిస్టెంట్లను పీఎస్‌ హెచ్‌ఎంలుగా నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వీరిలో 404 మంది స్కూలు అసిస్టెంట్లను మాత్రమే హెచ్‌ఎంలుగా నియమించారు. మిగిలిన 105 పోస్టులను ప్రస్తుతం ఎస్‌జీటీలకు ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 474 ఉద్యోగోన్నతుల్లో జిల్లా పరిషత్‌ యాజమాన్యంలోని హైస్కూళ్లు, యూపీ స్కూళ్లు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 312మందికి, ప్రభుత్వ యజమాన్యంలోని పాఠశాలల్లో 98 మందికి, మునిసిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 37మందికి, ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 27మందికి లభించనున్నాయి. 172 పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులు, 67 ఫిజికల్‌ డైరెక్టర్లు, స్కూలు అసిస్టెంట్లు తెలుగు 25, ఉర్దూ రెండు, హిందీ 29, ఇంగ్లీషు 22, గణితం (తెలుగు) 44, గణితం(ఉర్దూ) 2, ఫిజికల్‌ సైన్స్‌ (తెలుగు) 16, పీఎస్‌(ఉర్దూ) 4, బయోలాజికల్‌ సైన్స్‌ (తెలుగు) 40, బీఎస్‌ (ఉర్దూ) 3, సోషల్‌ (తెలుగు) 38, ఎస్‌ఎస్‌(ఉర్దూ) 1, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులు 8 ప్రస్తుతం ఉద్యోగోన్నతులు ద్వారా భర్తీచేస్తున్నారు. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా ఎంత మందికి ఉద్యోగోన్నతులు ఇస్తున్నదన్నది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు.

సర్టిఫికెట్ల పరిశీలన

స్కూలు అసిస్టెంట్లు, పీఎస్‌ హెచ్‌ఎం పోస్టులకు అర్హులైన సెకండరీ గ్రేడ్‌ టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో నిర్వహించారు. ఒక్కో దానికి ముగ్గురు చొప్సున 474 పోస్టులకు 1,422మంది ఎస్‌జీటీల సర్టిఫికెట్లు పరిశీలించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేక బృందాలు సర్టిఫికెట్లను పరిశీలించాయి. ఎస్‌జీటీల సర్వీసు రిజిస్టర్లు, విద్యార్హతల ఒరిజనల్‌ సర్టిఫికెట్లను పరిశీలించారు. సర్టిఫికెట్ల పరిశీలనను డీఈవో కిరణ్‌కుమార్‌ పర్యవేక్షించారు.

Updated Date - Jun 05 , 2025 | 01:24 AM