Share News

‘టీడీపీ’ పార్లమెంట్‌ కమిటీలో 42 మంది

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:02 PM

తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ కమిటీలను ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఒక్కొక్క పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 42మంది కమిటీ సభ్యులు వాటిలో ఉన్నారు. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు.

‘టీడీపీ’ పార్లమెంట్‌ కమిటీలో  42 మంది

వెల్లడించిన టీడీపీ అధిష్టానం

ఫ తొలుత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ప్రకటన

ఫ తాజాగా మిగతా 40 మంది...

ఫ అన్ని నియోజకవర్గాలకూ సమప్రాధాన్యం

ఒంగోలు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ కమిటీలను ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. ఒక్కొక్క పార్లమెంట్‌ స్థానానికి మొత్తం 42మంది కమిటీ సభ్యులు వాటిలో ఉన్నారు. అందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి కమిటీ సభ్యులను కూడా ప్రకటించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్‌, కార్యాలయ కార్యదర్శి, మీడియా కోఆర్డినేటర్‌, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌లు ఒక్కొక్కరు కాగా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, అధికార ప్రతినిధులు ఒక్కొక్క పోస్టుకు 9 మందిని నియమించారు. అలా మొత్తం 42 మందితో కమిటీ ఉండగా నాలుగు రోజుల క్రితం పార్లమెంట్‌ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన కొఠారి నాగేశ్వరరావులను ప్రకటించారు. మిగిలిన 40 మంది కమిటీ సభ్యులను బుధవారం ప్రకటించారు. పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్నింటికీ కమిటీలో సమప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యమైన అన్ని సామాజికవర్గాల వారు కూడా అందులో ఉన్నారు. అధిష్ఠానం ప్రకటించిన పార్లమెంట్‌ కమిటీ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కొఠారి నాగేశ్వరరావు(ఒంగోలు), కోశాధికారిగా అంబవరం శ్రీనివాసరెడ్డి (గిద్దలూరు), కార్యాలయ కార్యదర్శిగా షేక్‌ షరీఫ్‌ (కనిగిరి), మీడియా కోఆర్డినేటర్‌గా పాటిబండ్ల రాజశేఖర్‌ (ఒంగోలు), సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా రాచకొండ మల్లికార్జున (మార్కాపురం) నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం.మల్లికార్జునరెడ్డి (వైపాలెం), కంచర్ల కాశయ్య (మార్కాపురం), చీకటి వెంకటసుబ్బయ్య (కనిగిరి), బోర్రాజు శ్రీను (కనిగిరి), బిజ్జాల కిషోర్‌ (గిద్దలూరు), షేక్‌ అరిఫా (ఒంగోలు), గేనం సుబ్బారావు (ఒంగోలు), గొర్రెపాటి రామయ్య చౌదరి (కొండపి), కాట్రాజు నాగరాజు (దర్శి) నియమితులయ్యారు. ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా వై.దేవయ్య (వైపాలెం), ఎస్‌.నాసర్‌రెడ్డి (మార్కాపురం), నాగిశెట్టి చెన్నమ్మ (కనిగిరి), గుర్రం డానియేలు (గిద్దలూరు), గార్లపాటి శ్రీనివాసరావు (ఒంగోలు), కసుకుర్తి అంకరాజు (ఒంగోలు) సైకం చంద్రశేఖర్‌ (కొండపి), చెన్నారెడ్డి నరసారెడ్డి (కొండపి), వల్లెపను వెంకటనారాయణ (దర్శి) నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా పాలడుగు వెంకటకోటయ్య (వైపాలెం), ఆళ్ళ తిరుపతమ్మ (వైపాలెం), షేక్‌ షాహిద్‌ (మార్కాపురం), వై.ఈశ్వరమ్మ (మార్కాపురం), వైఎ్‌స.ప్రసాదరెడ్డి (కనిగిరి), ఎం.ఝాన్సీశ్వేత (గిద్దలూరు), బీరం అరుణారెడ్డి (ఒంగోలు), దాసరి వెంకటేశ్వర్లు (కొండపి), గడ్డం బాలయ్య (దర్శి) నియమితులయ్యారు. కార్యదర్శులుగా ఎం.మంత్రునాయక్‌ (వైపాలెం), యెండ్లూరి పెద్దబన్ని (మార్కాపురం), తాతపూడి కూమర్‌ (కనిగిరి), వి.లక్ష్మీదేవి (గిద్దలూరు), టి. శ్రీరామమూర్తి (ఒంగోలు), పీ.ఏస్తేరమ్మ (కొండపి), పఠాన్‌ సుభాని (దర్శి), నూనె విజయకుమారి (దర్శి) నియమితులయ్యారు.


బాపట్ల పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడిగా గొల్లపూడి

జిల్లాలోని సంతనూతలపాడు ని యోజకవర్గం బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో ఉండగా ఆ పార్లమెంట్‌ కమిటీలో పలు పదవులు ఎస్‌ఎన్‌పాడుకు దక్కా యి. కీలకమైన పార్లమెంట్‌ ఉపాధ్యక్షునిగా చీమకుర్తికి చెందిన గోల్లపూడి సుబ్బారావు నియమితులు కాగా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా దార్ల రామారావు, అఽధికార ప్రతినిధిగా తన్నీరు శ్రీనివాసరావు, కార్యదర్శులుగా కూకట్ల విజయ, ఎ.కుమారస్వామిలు నియమితులయ్యారు.

Updated Date - Dec 24 , 2025 | 11:02 PM