Share News

చీమకుర్తి మున్సిపాల్టిలో ఇక 27 వార్డులు

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:45 PM

ప్రభుత్వ ఆదేశాల మేరకు చీమకుర్తి మున్సిపాల్టీ పరిధిలో వార్డుల పునర్విభజన కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్‌ అధికారులు పూర్తిచేశారు. నిబంధనలు మేరకు మున్సిపాల్టీ పరిధిలో 20 నుంచి 27కు వార్డులు సంఖ్య పెరిగిన నేపఽథ్యంలో తదనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి ముసాయిదా జాబితాను సోమవారం కమిషనర్‌ వై.రామకృష్ణయ్య విడుదల చేశారు.

చీమకుర్తి మున్సిపాల్టిలో ఇక 27 వార్డులు
ముసాయిదా జాబితాను విడుదల చేస్తున్న కమిషనర్‌ రామకృష్ణయ్య

-అక్టోబర్‌ 6వ తేదీ వరకూ అభ్యంతరాల స్వీకరణ

చీమకుర్తి,సెప్టెంబరు29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు చీమకుర్తి మున్సిపాల్టీ పరిధిలో వార్డుల పునర్విభజన కార్యక్రమాన్ని సోమవారం మున్సిపల్‌ అధికారులు పూర్తిచేశారు. నిబంధనలు మేరకు మున్సిపాల్టీ పరిధిలో 20 నుంచి 27కు వార్డులు సంఖ్య పెరిగిన నేపఽథ్యంలో తదనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులననుసరించి పునర్విభజన ప్రక్రియ పూర్తిచేసి ముసాయిదా జాబితాను సోమవారం కమిషనర్‌ వై.రామకృష్ణయ్య విడుదల చేశారు.ఈ జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్‌ ఆరో తేదీలోపు మున్సిపల్‌ కార్యాలయంతో పాటు ఆయా వార్డుల పరిధిలోని సచివాలయాల్లో రాతపూర్వకంగా,వివరణాత్మకంగా,ఆధారాలతో తెలియజేయాలని రామకృష్ణయ్య తెలిపారు.

కాగా పట్టణంలో వార్డుల పునర్విభజనతో గతంలో ఉన్న వార్డుల సంఖ్యతో పాటు ముఖచిత్రమే మారనుంది.పట్టణానికి ఉత్తరం వైపునుంచి సర్వే నంబర్‌ 741 నుంచి ఒకటో వార్డు ప్రారంభం కానుంది. చివరి వార్డు అయిన 27వ వార్డు గరికమిట్ట చెరువు ఉన్న ప్రాంతమైన సర్వే నంబర్‌ 723 తో ముగించనుంది. గతంలో ఉన్న వార్డుల సంఖ్యతో పాటు ప్రాంతం కూడా మారనుంది.వార్డుల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల మేరకు పక్కాగా నిర్వహించామని కమిషనర్‌ రామకృష్ణయ్య తెలిపారు.ప్రక్రియ ఆసాంతం పారదర్శకంగా నిర్వహించామన్నారు.ప్రతి వార్డులో అటుఇటుగా 850 మంది ఓటర్లు ఉండే విధంగా 27వార్డులను పునర్విభజన చేశామని వివరించారు. గతంలో వార్డుకు 1200మంది వరకూ ఓటర్లు ఉండేవారు.

Updated Date - Sep 29 , 2025 | 11:45 PM