Share News

20 సవర్ల నగలు అపహరణ

ABN , Publish Date - May 13 , 2025 | 02:07 AM

బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి బ్యాగ్‌ను కోసి అందులో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.37వేల నగదును అపహ రించుకెళ్లారు. ఈ ఘటన కొండపి బస్టాండ్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తాళ్లూరు మండలం తూర్పుగంగ వరం గ్రామానికి చెందిన గుట్టపల్లి కుమారి కందు కూరు మండలం విక్కిరాలపేటలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయల్దేరారు.

20 సవర్ల నగలు అపహరణ

రూ.37వేల నగదు కూడా..

ప్రయాణికురాలి సంచి కోసి చోరీ

బాధితురాలిది తాళ్లూరు మండలం తూర్పుగంగవరం

విక్కిరాలపేట వెళ్తుండగా కొండపి బస్టాండ్‌లో ఘటన

కొండపి, మే 12 (ఆంధ్ర జ్యోతి) : బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి బ్యాగ్‌ను కోసి అందులో ఉన్న 20 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.37వేల నగదును అపహ రించుకెళ్లారు. ఈ ఘటన కొండపి బస్టాండ్‌లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తాళ్లూరు మండలం తూర్పుగంగ వరం గ్రామానికి చెందిన గుట్టపల్లి కుమారి కందు కూరు మండలం విక్కిరాలపేటలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయల్దేరారు. అందులో భాగంగా కొండపికి చేరుకున్నారు. విక్కిరాలపేటకు వెళ్లే బస్సు ఉదయం 9.30 గంటలకు బస్టాండ్‌కు వచ్చింది. అక్కడ ఉన్న ప్రయాణికులతోపాటు కుమారి కూడా బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా చేతిలోని సంచి బరువు తగ్గి అందులోని చీరలు బయటకు వచ్చాయి. అనుమానంతో సంచిని చూడ గా అది కోసి ఉంది. దానిలో 20సవర్ల బంగారు ఆభరణాలు, రూ.37,00 నగదు ఉంచిన పర్సు కని పించలేదు. దీంతో విలపిస్తూ ఆమె పోలీసుస్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. కొండపి బస్టాండ్‌లో తాను బస్సు కోసం వేచి ఉన్నప్పుడు ఒడిలోనే సంచిని ఉంచుకున్నానని, బస్సు ఎక్కేటప్పుడే ఎవరో దాన్ని కోసి పర్సును తీసుకున్నారని వాపోయారు. ఎస్సై ప్రేమ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - May 13 , 2025 | 02:07 AM