లోక్ అదాలత్‌లో 19,500 కేసులు పరిష్కారం
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:37 AM
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 19,500 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో 29 బెంచిల్లో న్యాయాధికారులు, న్యాయవాదులతో కలిసి 19,250 క్రిమినల్, 10 ప్రీలిటిగేషన్, 240 సివిల్ కేసులను పరిష్కరించినట్లు వెల్ల డించారు.
జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి రాజ్యలక్ష్మి
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 19,500 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయాధికారి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో 29 బెంచిల్లో న్యాయాధికారులు, న్యాయవాదులతో కలిసి 19,250 క్రిమినల్, 10 ప్రీలిటిగేషన్, 240 సివిల్ కేసులను పరిష్కరించినట్లు వెల్ల డించారు. వివిధ కేసుల్లో కక్షిదారులకు సుమారు రూ.5కోట్లను అందజేసినట్లు చెప్పారు. యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడాలకు సంబంధించిన పలు కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఒంగోలులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో జరిగిన అదాలత్‌లో జిల్లా అదనపు న్యాయాధికారులు రాజావెంకటాద్రి, పూర్ణిమ, లలిత, సీనియర్ సివిల్ న్యాయాధికారి హేమలత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జూనియర్ న్యాయమూర్తులు పాల్గొన్నారు.