Share News

జిల్లాకు 1,450 పశువుల షెడ్లు

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:24 AM

పశుపోషకులకు ఊతం ఇచ్చేందుకు ఉద్దేశించిన పశువుల షెడ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొనసాగించనుంది. పల్లె పండుగ 2.0 కింద జిల్లాకు 1,450 షెడ్‌లను మంజూరు చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. వచ్చే నెల 1నుంచి నిర్మాణాలు ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో డ్వామా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.

జిల్లాకు 1,450 పశువుల షెడ్లు

పల్లెపండుగ 2.0లో కేటాయింపు

వచ్చేనెల 1నుంచి నిర్మాణాలు ప్రారంభం

పంచాయతీకి సగటున రెండు

యూనిట్‌కు గరిష్ఠంగా రూ.2లక్షలు

సామూహిక మొక్కల పెంపకంపైనా దృష్టి

ఒంగోలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : పశుపోషకులకు ఊతం ఇచ్చేందుకు ఉద్దేశించిన పశువుల షెడ్ల నిర్మాణాన్ని ఈ ఏడాది కూడా ప్రభుత్వం కొనసాగించనుంది. పల్లె పండుగ 2.0 కింద జిల్లాకు 1,450 షెడ్‌లను మంజూరు చేసింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. వచ్చే నెల 1నుంచి నిర్మాణాలు ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో డ్వామా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఎంపీడీవోలతో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. సామూహిక మొక్కల పెంపకంపైనా చర్చించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ పేరుతో గత ఏడాది గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పథకం మెటీరియల్‌ కోటా నిధులతో పెద్దఎ త్తున మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారిం చింది. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్‌ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చింది. అదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వ కాలంలో మినీ గోకులం పేరుతో చేపట్టిన పశువుల షెడ్ల నిర్మాణాలను కూడా గత ఏడాది పల్లె పండుగ పనుల్లో చేపట్టింది. ఉపాధి పథకం మెటీరి యల్‌ నిధుల నుంచి రూ.2.30 లక్షలు యూనిట్‌ విలు వగా నిర్ణయించింది. అందులో పది శాతం లబ్ధిదారుడు భరిస్తే మిగిలిన 90శాతం ఉపాధి నిధుల నుంచి రాయితీగా సమకూర్చింది. ఆ సమయంలో జిల్లాకు 1,075 షెడ్లను కేటాయించింది. డ్వామా, పశుసంవర్థక శాఖల సిబ్బంది సంయుక్తంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అన్ని అర్హతలు ఉన్నట్లు గుర్తించి 1,025 యూ నిట్లను మంజూరు చేశారు. అందులో 833 షెడ్ల నిర్మా ణాలు పూర్తి కాగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

ఈసారి పంచాయతీ యూనిట్‌గా కేటాయింపు

ఈ ఏడాది కూడా పల్లెపండుగ 2.0 కింద పశువుల షెడ్ల పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో అమలు చేస్తోంది. గత ఏడాది యూనిట్‌ విలువ గరిష్ఠంగా 2.30 లక్షలు కాగా ప్రస్తుతం దాన్ని రూ.2 లక్షలకు తగ్గించింది. గతంలో మండలం యూనిట్‌గా తీసుకొని అందులో తీరప్రాంత, ఇతర మండలాలుగా విభజించారు. ఈసారి పంచాయతీని యూనిట్‌గా తీసుకుంటున్నారు. సగటున ఒక్కో పంచాయతీకి రెండేసి వంతున ఇవ్వాలని నిర్ణ యించినట్లు సమాచారం. జిల్లాకు 1,450 యూనిట్లను కేటాయించారు. ఆ ప్రకారం జిల్లాలో 729 పంచాయ తీలు ఉండగా సగటున ఒక్కోదానికి రెండేసి రాను న్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గుర్తింపు ప్రక్రియను ఎంపీడీవోల పర్యవేక్షణలో డ్వామా సిబ్బంది చేపట్టారు. 1,200 యూనిట్ల గుర్తింపు కొలిక్కి వచ్చినట్లు డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ శుక్రవారం మండల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ధారణకు వచ్చారు. వచ్చేనెల 1 నుంచి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఎంపీడీవోలను ఆయన కోరారు. సామూహిక మొక్కల పెంపకంపై కూడా డ్వామా అధికారులు దృష్టి సారించారు.

Updated Date - Sep 27 , 2025 | 01:24 AM