ఎర్నాకుళం ఎక్స్‌ప్రె్‌సలో 14 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:20 AM
ఎర్నాకుళం ఎక్స్‌ప్రె్‌సలో 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకున్నటు ్లఈగల్ టీమ్ సీఐ సుధాకర్ తెలిపారు. సోమవారం ఈగల్ టీమ్ ఒంగోలు రైల్వే స్టేషన్‌నుంచి కావలి వరకు ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు.
ఒంగోలు క్రైం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఎర్నాకుళం ఎక్స్‌ప్రె్‌సలో 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకున్నటు ్లఈగల్ టీమ్ సీఐ సుధాకర్ తెలిపారు. సోమవారం ఈగల్ టీమ్ ఒంగోలు రైల్వే స్టేషన్‌నుంచి కావలి వరకు ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఒడిసాకు చెందిన ఆనంద్‌రాణా, మిలు మాతాలిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1972, 112,పోలీసు వాట్సప్ నంబరు 9121102266 కు ఇవ్వాలని అన్నారు. ఈ తనిఖీలలో ఈగల్ టీమ్ ఎస్సైలు శివరామయ్య, చెంచయ్య, జీఆర్పీ ఎస్సై మధుసూధనరావు సిబ్బంది ఉన్నారు.