Share News

11 నుంచిమార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Apr 10 , 2025 | 10:48 PM

మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు.

11 నుంచిమార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

మార్కాపురం వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. 11వ తేదీ అంకురార్పణ, ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, రాత్రి రాయభారం, ఎదుర్కోల, సూర్యవాహనసేవ నిర్వహించనున్నారు. 12న కల్యాణం నిర్వహించనున్నారు. 13న చంద్రవాహనం, 14న సింహవాహనం, 15న శేషవాహనం, 16న వ్యాళి వాహనం, 17న పొన్నవాహనం, 18న హనుమంత వాహనం, 19న గరుడ వాహనం, 20న గజవాహనం, 21న రథోత్సవం, 22న అశ్వవాహనం, 23న హంస వాహనం, 24, 25, 26, 27న వసంతోత్సవం, 28న ఊంజల్‌ సేవ, 29న 16 రోజుల పండుగ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ప్రభలు పలు సాంస్కృతిక కళా కార్యక్రమాలు, ఎడ్లబండ్ల లాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు

Updated Date - Apr 10 , 2025 | 10:48 PM