Share News

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ABN , Publish Date - Nov 22 , 2025 | 02:35 AM

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఆ ప్రకారం మార్చి 16వతేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

మార్చి 16 నుంచి ప్రారంభం

ఒంగోలు విద్య, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఆ ప్రకారం మార్చి 16వతేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. తొలి రోజు ఫస్ట్‌ లాంగ్వేజీ (గ్రూపు-ఎ) పరీక్ష ఉంటుంది. 18న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 20న ఇంగ్లీషు, 23న లెక్కలు, 25న ఫిజికల్‌ సైన్స్‌, 28న బయోలాజికల్‌ సైన్స్‌, 30న సోషల్‌, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌-2, సంస్కృతం, అరబిక్‌, ఏప్రిల్‌ 1వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌, ఒకేషనల్‌ కోర్సు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు.

Updated Date - Nov 22 , 2025 | 02:35 AM