Share News

రోజుకు లక్ష మంది

ABN , Publish Date - Sep 16 , 2025 | 02:42 AM

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాల్లో స్త్రీశక్తి దూసుకెళుతోంది. గతంలో అంతంతమాత్రంగా ఉండే మహిళా ప్రయాణికుల సంఖ్య నేడు రెట్టింపు అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించిన ఉచిత ప్రయాణ పథకానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది.

రోజుకు లక్ష మంది
మహిళలతో రద్దీగా ఉన్న ఒంగోలు బస్టాండ్‌

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య ఇదీ..

అనూహ్య ఆదరణతో దూసుకెళుతున్న ‘స్ర్తీ శకి’్త

35 శాతం నుంచి 65శాతంకు పెరిగిన మహిళా ప్రయాణికులు

నెలరోజుల్లో సంస్థకు రూ.11.20 కోట్ల ఆదాయం

ఉచిత ప్రయాణంలో సిబ్బందికీ అవమానాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాల్లో స్త్రీశక్తి దూసుకెళుతోంది. గతంలో అంతంతమాత్రంగా ఉండే మహిళా ప్రయాణికుల సంఖ్య నేడు రెట్టింపు అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించిన ఉచిత ప్రయాణ పథకానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ప్రకాశం రీజియన్‌లో ఆర్టీసీకి ఆర్థిక పుష్టి లభిస్తున్నప్పటికీ మరోవైపు పెరుగుతున్న ప్రయాణికుల దృష్ట్యా బస్సుల సంఖ్య, సిబ్బంది కొరత వేధిస్తోంది. నిన్న మొన్నటి వరకు పల్లె ముఖం ఎరుగని పల్లె వెలుగు బస్సులు ఇప్పుడు ఊరూరా తిరిగేస్తున్నాయి.

ఒంగోలు కార్పొరేషన్‌, సెప్లెబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీకి స్త్రీశక్తి కలిసొచ్చింది. రీజియన్‌ పరిఽధిలో ఈనెల రోజుల్లో 25లక్షల 24వేల మంది మహిళలు ప్రయాణించినట్లు సంస్థ అధికారులు వెల్లడిస్తున్నారు. రోజుకు సుమారు లక్ష మంది ఊరూరా ప్రయాణిస్తున్నారని సమాచారం. రీజియన్‌ పరిధిలో రోజుకు 2.3లక్ష కిలోమీటర్లు అన్ని బస్సులు నడపగా, కేవలం స్త్రీ శక్తికి కేటాయించిన బస్సులే 1.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. దీంతో నెల రోజుల్లో ఆర్టీసీకి రూ.11.20 కోట్ల మేర ఆదాయం లభించింది. పథకం మరింత సమర్థవంతగా అమలుకు అదనపు బస్సులు, సిబ్బంది పెంపు అవసరంగా కనిపిస్తోంది.

పెరిగిన మహిళా ప్రయాణికులు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారం భమై సరిగ్గా నెల అవుతోంది. నాడు పల్లె ముఖం ఎరుగని బస్సులు ఇప్పుడు స్త్రీశక్తి పుణ్యమా అని ఊరూరా తిరుగు తున్నాయి. జిల్లాలో మొత్తం 485 బస్సులు నడుపుతుండగా, అందులో 325 ‘స్త్రీ శక్తి’కి కేటాయించారు. దీంతో పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌,డీలక్స్‌బస్సులకు మరింత డిమాండ్‌ ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో గతంతో పోల్చుకుంటే ఈ నెల రోజుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 35శాతం మంది మహిళలు మాత్రమే ప్రయాణించారు. ఇప్పుడు వారి సంఖ్య రెట్టింపు అయింది. ఈనెల రోజుల గణాంకాలను పరిశీలిస్తే మహిళాప్రయాణికులు65శాతం పెరగ్గా, పురుషులు 35 శాతం మాత్రమే ప్రయాణించినట్లు అర్థమవుతుంది.

రూ.11.20 కోట్లు ఆదాయం

ప్రకాశం రీజియన్‌లో ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, పొదిలి డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలోని 866 గ్రామాలకు అనుసం ధానంగా 20 బస్‌ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. అలాగే 484 ఆర్టీసీ బస్సులు ఉండగా వాటిలో 95 అద్దె ప్రాతిపదికన (హయ్యర్‌) నడస్తున్నాయి. ఈ బస్సులన్నీ సుమారు రోజుకు 2లక్షల కిలోమీటర్లు ప్రయాణికుల కోసం రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిలో 1.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిలో 1.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇంతకముందు ప్రకాశం రీజియన్‌కు రోజుకు రూ.77.51 లక్షల ఆదాయం వస్తుండగా,నెలకు రూ.23.25 కోట్లు అన్నివర్గాల ప్రజల నుంచి లభించేది. అందులో అత్యధిక శాతం మంది పురుషులే ఉండేవారు. ఉచిత ప్రయాణం పథకంతో అందులో సగం మందికిపైగా మహిళలు కావడంతో వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడంతో 325 స్త్రీశక్తి బస్సుల ద్వారా రూ.11.20 కోట్లు ఆదాయం లభించింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నప్పటికీ వారికి జీరో టికెట్‌ కొడతారు. అందుకు సంబంధించిన నగదును ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. తద్వారా సంస్థకు ఆదాయం లభిస్తుంది.

ఆర్టీసీ సిబ్బందికీ అవమానాలు..!

స్త్రీశక్తి పథకం ద్వారా కేటాయించిన బస్సుల్లో ఉచిత ప్రయాణంలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సిబ్బందికి అవమానాలు తప్పడం లేదు. సీట్ల కోసం కొట్లాటలు. మాటల యుద్ధాలే జరుగుతున్నాయి. దీంతో సర్దిచెప్పేందుకు సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు ఆ బస్సులో ప్రయాణించే పురుషులకు సీటు లేక నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొందరు మహిళలు ఆ బస్సు మాకే కేటాయించారు, మీరు దిగిపోండని అవగాహన లేకుండా మాట్లాడుతుతున్నారు. పథకం అమలు వివరించే క్రమంలో మహిళ ప్రయాణికులు ప్రవర్తిస్తున్న తీరు మరింత ఆవేదన కలిగిస్తున్నదని సిబ్బంది వాపోతున్నారు. అంతేకాకుండా నిర్ణయించిన స్టాప్‌లోనే బస్‌ను ఆపుతున్న క్రమంలో తాము చెప్పిన చోట ఆపాలని పట్టుబడుతున్నారు. అలా వీలుకాదని కండక్టర్‌ చెప్పే క్రమంలో కొందరు మహిళల ఇష్టారీతిన మాట్లాడటం మరింత బాధిస్తోందని, స్త్రీ శక్తి బస్సుల్లో డ్యూటీ చేయలేమని కొందరు సిబ్బంది తేల్చిచెబుతున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 02:42 AM