Share News

Duvvada Srinivas: లోకేశ్‌ను పొగిడితే ఊరుకుంటారా?

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:55 AM

మంత్రి లోకేశ్‌ను పొగడటం కారణంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి హఠాత్తుగా సస్పెండ్‌ చేశారు. గతంలో వివాదాల్లో ఉన్నా జగన్‌ పట్టించుకోకపోవడం, ఇప్పుడు మాత్రం స్పందించడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.

Duvvada Srinivas: లోకేశ్‌ను పొగిడితే ఊరుకుంటారా?

దువ్వాడపై సస్పెన్షన్‌ వేటు అందుకే

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తే... పదవులిచ్చి ప్రోత్సాహకాలు! వారిలోని మంచిని పొగిడితే మాత్రం... సస్పెన్షన్‌ వేటు! ఇదీ... జగన్‌ మార్కు రాజకీయం! ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా్‌సను మంగళవారం రాత్రి హఠాత్తుగా వైసీపీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. స్థానిక వైసీపీ మహిళా నేతతో సహ జీవనం, ఇన్‌స్టా రీల్స్‌, తిరుమల పర్యటనలో ఫొటోషూట్‌, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ... జగన్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. అలాంటిది... ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్‌ చేశారనేది చర్చనీయాంశంగా మారింది. మంత్రి లోకేశ్‌ను పొగడటమే దీనికి కారణమని తేలింది. ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి పాల్గొన్నారు. ‘బాలయ్య తర్వాత స్వీటెస్ట్‌ పర్సన్‌ ఎవరు’ అని అడిగిన ప్రశ్నకు... ‘లోకేశ్‌’ అని ఇద్దరూ ఏకకాలంలో చెప్పారు. లోకేశ్‌ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ కొనియాడారు! లోకేశ్‌ను అంతగా పొడిగితే జగన్‌ ఊరుకుంటారా? పార్టీ నుంచి సస్పెండ్‌ చేసేశారు


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:55 AM