బంగారు రథంపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:41 PM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై విహారించారు.

వైభవంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు రథంపై విహారించారు. ఆదివారం మాఘమాసం ద్వాదశి శుభదినం సందర్భంగా మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. బృందావనానికి క్షీరాభిషేకం, విశేష పంచామృతాభిషేకం చేసి వెండి, బంగారు, పట్టు వస్ర్తాలతో శోభాయమానంగా అలంకరించారు. పూర్ణబోధ పూజ మందిరంలో మూలరాములకు , జయరాములు, దిగ్విజయరాములకు కనకాభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వర్ణ రథం పై వజ్రాలు పొదిగిన ప్రహ్లాదరాయలను అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజలసేవ నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి విశేష పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.