Minister Dola: పీపీపీ మోడల్‌లో లిడ్‌క్యాప్ భూముల అభివృద్ధి
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:02 AM
లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు వాటిని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కూటమి..
విజయవాడ, తిరుపతిలో మల్టీపర్పస్ కాంప్లెక్స్‌ల నిర్మాణం: డోలా
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): లిడ్ క్యాప్ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటంతో పాటు వాటిని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. బుధవారం సచివాలయంలో లిడ్‌క్యాప్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో తిరుపతి, విజయవాడలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణంపై మంత్రికి అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్వీ ఆటో నగర్‌లోని 4.5 ఎకరాలు, విజయవాడ ఆటోనగర్‌లో ఒక ఎకరా లిడ్‌క్యాప్ స్థలాల్లో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణనం చేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని మంత్రి తెలిపారు.