IAS Postings: ట్రైనీ ఐఏఎ్‌సలకు పోస్టింగ్‌లు
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:53 AM
ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఫేజ్-2 శిక్షణ పూర్తి చేసుకున్న 2023 బ్యాచ్‌కు
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఫేజ్-2 శిక్షణ పూర్తి చేసుకున్న 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎ్‌సలకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్‌గా చల్లా కళ్యాణిని నియమించారు. అక్కడ పనిచేస్తున్న వై.మెఘా స్వరూ్‌పను బదిలీ చేశారు. కందుకూరు సబ్ కలెక్టర్‌గా డి.హిమ వంశీ, పాలకొండ సబ్ కలెక్టర్‌గా పవర్ స్వప్నిల్ జగన్నాథ్, నూజివీడు సబ్ కలెక్టర్‌గా బొల్లిపల్లి వినూత్న, రాజంపేట సబ్ కలెక్టర్‌గా హెచ్.ఎ్‌స.భావన, రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా శుభమ్ నొఖ్వాల్, పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా ఆర్.వైశాలిని నియమించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవను ప్రభుత్వం బదిలీ చేసింది. వీరంతా జూన్ 25న ముస్సోరీలోని శిక్షణ నుంచి బయటికి వచ్చారు. ఈనెల 8వ తేదీలోగా వారికి కేటాయించిన స్థానాల్లో జాయిన్ కావాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.