Share News

మఠంలో పూజలు ప్రారంభం

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:58 PM

మండల కేంద్రం నడిబొడ్డులో ఉన్న పెద్దమఠాన్ని స్థానికులే బాగు చేసుకున్నారు. శివర్రాతి సందర్భంగా అందులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మఠంలో పూజలు ప్రారంభం
మఠంలో పూజలు నిర్వహిస్తున్న ప్రజలు

కొత్తచెరువు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నడిబొడ్డులో ఉన్న పెద్దమఠాన్ని స్థానికులే బాగు చేసుకున్నారు. శివర్రాతి సందర్భంగా అందులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పెద్దమఠం శిథిలావస్థకు చేరుకోవడంతో పూజలు లేక.. నిరుపయోగంగా మారింది. దీంతో ఆ మఠం ఆకతాయిలకు గంజాయి, మద్యం తాగుబోతులకు నిలయంగా మారింది. ఆ యువకులు ఆ మఠంలో గంజాయి, మద్యం సేవించి గొడవకు దిగుతుండటంతో ఆ చుట్టు పక్కల నివాసముంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. దీంతో స్థానికులే స్పందించి.. ఆ మఠంలో మఠంలో చెత్త, చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. సున్నం పూసి.. ముస్తాబు చేశారు. శివరాత్రి సందర్భంగా ఆ మఠాన్ని అలంకరించారు. మఠంలోని శివునికి, నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇకపై ఈ మఠంలోకి ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తామే వారికి తగిన రీతిలో బుద్ధిచెబుతామని హెచ్చరించారు. పోలీసులు కూడా రాత్రి సమయంలో మఠం వద్ద గస్తీ నిర్వహించాలని కోరుతున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:58 PM