Share News

కుర్చీ ఎవరిదో?

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:19 AM

ఎట్టకేలకు ఏలూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ల ఎంపికకు రంగం సిద్ధమైంది. జనవరి 27న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎంపికకు మార్గం సుగమం అయ్యింది.

కుర్చీ ఎవరిదో?

నేడు ఏలూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్లు.. నూజివీడు మునిసిపాలిటీలో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

ఏలూరులో డిప్యూటీ మేయర్ల ఎంపిక లాంఛనమే..

టీడీపీ నుంచి బరిలో వందనాల దుర్గాభవాని శ్రీనివాస్‌, పప్పు ఉమామహేశ్వరరావు

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : ఎట్టకేలకు ఏలూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ల ఎంపికకు రంగం సిద్ధమైంది. జనవరి 27న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో ఏలూరు నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య(చంటి) కూటమి తరపునుంచి ఇద్దరిని డిప్యూటీ మేయర్లుగా ఎంపిక చేశారు. 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్‌, 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ పప్పు ఉమామహేశ్వరరావులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. సోమవారం వీరిద్ద్దరూ బీఫారమ్‌లు అందుకుని డిప్యూటీ మేయర్లుగా నామినేషన్లు వేసే అవకాశాలు న్నా యి. గతంలో వైసీపీ కార్పొరేటర్‌ గుడిదే శ్రీనివాస్‌, నూక పేయి సుధీర్‌ బాబులు డిప్యూటీ మేయర్లుగా వ్యవహ రించారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబుతో పాటు మెజారిటీ కార్పొరేటర్లంతా కూటమిలో చేరారు. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. 2021, జూలైలో నగర పాలక సంస్థలోని 50 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా టీడీపీ నుంచి ముగ్గురు, వైసీపీ నుంచి 47 మంది కార్పొ రేటర్లు ఎన్నికయ్యారు. గతేడాది సాధారణ ఎన్ని కల ముందు వైసీపీకి ఉన్న ప్రజావ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మరో ముగ్గురు కార్పొ రేటర్లు టీడీపీలోకి వచ్చారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడంతో మేయర్‌తో సహా మరో 21 మంది కార్పొరేటర్లు కూట మి ప్రభుత్వంలో చేరారు. దీంతో నగర పాలక సంస్థ పాలక మండలిలో కూట మి కార్పొరేటర్ల సంఖ్య 27కు చేరు కుంది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఆళ్ళ నాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం తో ఆ పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు దిక్కుతోచని పరి స్థితిలో ఉన్నారు. ఈక్రమం లో మిగిలిన కార్పొరేట ర్లంతా కూటమి అభ్యర్థు లకు మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి. డిప్యూటీ మేయర్ల ఎన్నిక అనంతరం పాల కమండలి అంతా కూటమి వైపే పూర్తి స్థాయిలో వచ్చే అవ కాశాలు న్నాయి.

నూజివీడు వైస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు

రసవత్తరంగా..

నూజివీడు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : నూజివీడు ముని సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సోమవారం జరగనున్న క్రమంలో నూజివీడులో రాజకీయం వేడెక్కింది. ఇటు మునిసి పాలిటీలో అధికార వైసీపీ తన పట్టును నిలుపు కునే ప్రయత్నం చేస్తుండగా, అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం వైస్‌ చైర్మన్‌ పదవిని తన ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. సార్వ త్రిక ఎన్నికల్లో తొలిసారి నూజివీడులో ఆ పార్టీ మెజార్టీ సాధించడంతో ఇటు పురపాలనను సైతం తన ఖాతాలో వేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇటు తాజా మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు నూజివీడు పురపాలకంలో తనపట్టును నిలుపుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ తన కౌన్సిలర్లను క్యాంప్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో సోమవారం నూజివీడు మునిసిపల్‌ సమావేశ మందిరంలో జరగనున్న వైస్‌ చైర్మన్‌ ఎన్నిక రసవత్తరంగా సాగనుంది.

టీడీపీ పరం కానున్న వైస్‌చైర్మన్‌ పదవి?

నూజివీడు మునిసిపాలిటీలో వార్డులు 32 ఉండగా తెలుగుదేశానికి ఎనిమిది వార్డుల్లో గెలుపొందగా మిగిలిన 24 వార్డులు వైసీపీ విజయం సాధించింది. అయినా వైస్‌ చైర్మన్‌ పదవి టీడీపీ పరం కానున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ఉన్న 24 మంది కౌన్సిలర్లలో పది నుంచి 12 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం గూటికి చేరనున్నట్టు సమాచారం. ఇదే జరిగితే వైస్‌చైర్మన్‌ కుర్చీ తెలుగుదేశంకు సునాయాసంగా దక్కనుంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద వైసీపీ క్యాంప్‌ పెట్టినా శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత క్యాంప్‌ నుంచి ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ నాయకులు బయట కు రప్పించి తమతో తీసుకెళ్లినట్టు సమాచారం. ఆది వారం రాత్రి విజయవాడలోని మంత్రి క్యాంప్‌ కార్యా లయం వద్ద టీడీపీ కౌన్సిలర్లతో పాటు, వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు తెలపడానికి వచ్చిన కౌన్సిలర్లతో మంత్రి సారథి ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

వైసీపీ కొంప ముంచిన రాజీనామా

ప్రస్తుత వైస్‌చైర్మన్‌ ఎన్నికకు కారణమైన తాజా మాజీ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ రాజీనామా వైసీపీ కొంప ముంచిందని చెప్పవచ్చు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు వైస్‌ చైర్మన్‌గా ఉన్న సీనియర్‌ వైసీపీ నాయకుడు పగడాల సత్య నారాయణను ఆ పదవి నుంచి స్థానిక వైసీపీ నాయ కత్వం బలవంతంగా తప్పించింది. తన రాజీనామా సమర్పించే క్రమంలో అయిష్టంగానే వ్యక్తిగత కారణా లతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పినా, నాటి నుంచి పగడాల వైసీపీకి క్రమేణ దూరమవుతూ వచ్చారు. మరోవైపు నూజివీడు మునిసిపల్‌ పరిధిలో ఎమ్మెల్యే ఎన్నికల్లో సారథికి మెజార్టీ రావడంతో ఇటు వైసీపీ కౌన్సిలర్లు సైతం టీడీపీ వైపు మొగ్గుచూపుతూ వచ్చారు. మరోవైపు నూజివీడు పట్టణ వైసీపీలో నెలకొన్న అనిశ్చితి ఈ పరిస్థితికి మరో కార ణం.ఒకవైపు మాజీ మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌, ప్రస్తుత కోఆప్షన్‌ సభ్యుడు రామిశెట్టి మురళీకృష్ణ నేతృత్వంలో, నూజివీడు పట్టణ వైసీపీ అధ్యక్షుడు శీలం రాము ఆధ్వర్యంలో, ఇటు పగడాల సత్యనారాయణ నేతృ త్వంలో ఎవరికి వారుగా మూడు గ్రూపులుగా వ్యవ హరిస్తుండగా దీనిని సరిచేయాల్సిన వైసీపీ స్థానిక నాయకత్వం స్పందించక పోవడంతో పురపాలకంలో వైసీపీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై టీడీపీ కసరత్తు

నూజివీడు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక పై టీడీపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. తాజా మాజీ వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ పేరుతో పాటు మునిసిపల్‌ కౌన్సిలర్‌గా ఉన్న మైనార్టీ వర్గానికి చెందిన మహిళతో పాటు ప్రస్తుతం ప్రైవేట్‌ ఉపాధ్యాయు రాలిగా పనిచేస్తున్న ఓ మహిళా కౌన్సిలర్‌ పేరు ప్రచారంలో ఉన్నాయి.

Updated Date - Feb 03 , 2025 | 12:19 AM