‘ఉపాధిహామీ’లో రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:45 PM
ఉపాధి హామీ కూలీల పనులలో రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు తగ్గించాలని జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్యయాదవ్ డిమాండ్‌చేశారు.

పుట్టపర్తిరూరల్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ కూలీల పనులలో రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు తగ్గించాలని జిల్లా సీపీఐ కార్యదర్శి వేమయ్యయాదవ్ డిమాండ్‌చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఉపాఽఽధిహామీ కార్యా లయంలో పీడీ విజయేంద్రప్రసాద్‌కు వినతిపత్రం అందచేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను కల్పించి వలసలు నివారించాలన్నారు. ఉపాధి హామీ పని దినాలను 200రోజులకు పెంచి రోజుకు 700 రూపాయలు కూలీ చెల్లించాలన్నారు. జాబ్‌కార్డుతో నిమిత్తం లేకుండా అడిగిన ప్రతిఒక్కరికి పనికల్పించాలని, సకాలంలో కూలీ వేతనం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలస్వామి, కుళ్ళాయప్ప, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, సీపీఐ పట్టణ కార్యదర్శి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.