PVN Madhav: కొల్లేరుకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:59 AM
జీవ వైవిధ్యం కలిగిన కొల్లేరుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. కబ్జాదారులపై చర్యలు తీసుకుని..
పోలవరం పూర్తిచేసి తీరతాం: మాధవ్
ఏలూరు, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘జీవ వైవిధ్యం కలిగిన కొల్లేరుకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. కబ్జాదారులపై చర్యలు తీసుకుని, పేదలకు న్యాయం చేస్తాం. పోలవరం ప్రాజెక్టుకు 100 శాతం నిధులు వెచ్చించి రెండు, మూడేళ్లలో పూర్తి చేసే బాధ్యతను ప్రధాని మోదీ తీసుకున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చెప్పారు. ‘సారథ్యం’ పేరిట జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఏలూరు వచ్చారు. బిర్లా భవన్ వద్ద ప్రజలతో చాయ్ పే చర్చ, శోభాయాత్ర, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపు పార్టీని బలోపేతం చేసే దిశగా విభిన్న కార్యక్రమాలతో బీజేపీ ముందుకు సాగుతుంది. ఇప్పటి వరకు 21 జిల్లాల్లో పర్యటించా’ అ అన్నారు. జిల్లాకు వచ్చిన మాధవ్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి తపనా చౌదరి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ ఘనంగా సత్కరించారు.