నిర్వాసితుల ‘కల’ పండింది
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:53 AM
పోలవరం నిర్వాసిత కుటుంబాలు ఒకటి కాదు.. రెండు కాదు. వేలాది కుటుంబాలు. ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల పరిధిలో అనేక గ్రామాలు పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం కారణంగా ముంపు గ్రామాలుగా మిగిలా యి.

వ్యక్తిగత ఖాతాల్లో పరిహారం జమ
పన్నెండేళ్లుగా పోలవరం నిర్వాసితుల నిరీక్షణ
వ్యక్తిగత పరిహారం కోసం ఏళ్ల తరబడి డిమాండ్
41.15 కాంటూరు పరిధిలోనే ఈ చెల్లింపులన్నీ..
కూటమి ప్రభుత్వ చొరవపై హర్షామోదాలు
గత ఐదేళ్లు నాటకాలాడిన జగన్ ప్రభుత్వం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి/ కుక్కునూరు) :
పోలవరం నిర్వాసిత కుటుంబాలు ఒకటి కాదు.. రెండు కాదు. వేలాది కుటుంబాలు. ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల పరిధిలో అనేక గ్రామాలు పోలవరం ప్రాజెక్టు నిర్మా ణం కారణంగా ముంపు గ్రామాలుగా మిగిలా యి. ఆయా గ్రామాల్లో కుటుంబాలకు సహా య పునరావాసం అందజేసి ప్రత్యేక కాలనీల కు తరలించే ప్రక్రియ చాలాకాలం క్రితమే ఆరంభమైంది. కాని ఆది నుంచి ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోతున్న నిరాశ్రయులం దరి నీ ఆదుకోవడానికే కేంద్ర, రాష్ట్రాలు అప్పట్లో ముందుకొచ్చాయి. ఈక్రమంలోనే ప్రాజెక్టు ఎగువున ఉన్న గ్రామాల్లో నిరాశ్రయులు ఎంతమంది అనేది అప్పట్లో లెక్క కట్టారు. ప్రతీ మండలంలోను 15 నుంచి 18 వేల కుటుంబాలు ఉన్నాయి. భూమికి భూమి, వ్యక్తిగత పరిహారం, వివాహం కాని వారికి సాయంలో తోడ్పాటు, ప్రత్యేక కాలనీల్లో గృహ సదుపాయం వంటివన్నీ ఆర్‌అండ్ ఆర్ ప్యాకే జీ పరిధిలోకి చేర్చారు. ముంపు ప్రాంతాల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీలు కాగా, మిగిలిన వారిలో బీసీ వర్గాలది మూడో స్థానం. తాత ముత్తాతల నుంచి మావూరు అంటూ బతికి న నేల నుంచి ఒక్కసారిగా కట్టుబట్టులతో వైదొలిగేందుకు ముందుగా ఆయా కుటుంబా లు ససేమిరా అన్నాయి. కాని దీర్ఘకాల ప్రయోజనాలు, రైతు అవసరాలను గుర్తించి తాము నష్టపోయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చి సర్వం కోల్పోవడానికి సిద్ధపడ్డారు. ఒకదశలో పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఎకరానికి రూ.80 వేలు కూడా పరిహారం లభించలేదు. ఆపై పదే పదే సవరణలు చేసిన తర్వాత, కేంద్రం ప్రాజెక్టు భూసేక రణ పరిధిలో మార్పులు, చేర్పులు చేయ డంతో ఎకరాకు రూ.లక్షా 40 వేల నుంచి రూ.2 లక్షల 60 వేల వరకు ధర ఎగబాకింది. దీంతో పాటు ఎంత భూమి కోల్పోతారో అంతకు అంత వేరే ప్రాంతంలో నిర్వాసితు లకు అప్పగించేందుకు భూమికి భూమి పథకాన్ని అమలులోకి తె చ్చారు. ప్రత్యేకించి పండ్ల తోటలు, సాగు భూ ములు, వాటిలో ఉన్న చెట్టు పుట్ట మోటారు తో సహా పరిహార జాబితాలో చేర్చారు. ఈ చర్యలన్నీ నిర్వాసిత కుటుంబా లకు కాస్త ఊ రట కలిగించాయి. 2014లో అధికార పగ్గాలు చేపట్టి న అప్పటి తెలుగుదేశం ప్రభు త్వం పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరం చేసిం ది. సమాంతరంగా నిర్వాసిత కుటుంబా లను ఆదుకునేందుకు ప్రస్తుతం ఉన్న గ్రామా ల్లో వారందరికీ ప్రత్యామ్నాయంగా ప్రత్యేకంగా కాలనీలు నిర్మిం చడంపై శ్రద్ధ పెట్టింది. ఈక్రమంలో 2014–19 వరకు ప్రాజెక్టు పనులే కాదు నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులోను వేగం పెంచారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
2004లో అధికార పగ్గాలు చేపట్టిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పరిధిలో భూసేకరణకు తెర లేపిం ది. ఏఏ గ్రామాలు పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయో ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించైనా సేకరణ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకునే దిశగా సాగింది. దీంతో అప్పట్లోనే గిరిజన, గిరిజ నేతర కుటుంబాలు నిరసనకు దిగాయి. ఆ తదుపరి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నిర్వాసిత కటుంబాలకు వ్యక్తిగత పరిహారం చెల్లింపు దిశగా శరవేగంగా అడుగులు వేసింది. నిర్వాసితుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఒక్కొక్కరికి వ్యక్తిగత పరిహారం కింద రూ.6 లక్షల 86 వేలు, బీసీ, ఓసీలకైతే ఒక్కొ క్కరికి వ్యక్తిగత పరిహారం కింద రూ.6 లక్షల 36 వేలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నా రు. ఆ మేరకు తాజాగా పన్నెండేళ్ల తర్వాత వ్యక్తిగత పరిహారం చెల్లింపునకు మోక్షం లభించింది. ముంపు మండలాలైన పోల వరం, కుక్కునూరు, వేలేరుపాడుతో సహా మిగతా ప్రాంతాల్లోను పరిహారం శుక్ర వారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యింది. దీంతోపాటు పునరావాస కాలనీల్లో ఇల్లు వద్దనుకునే వారికి ఒక్కొ కుటుంబానికి రూ.2 లక్షల 85 వేలు, అదే కాలనీలో స్థలం కూడా వద్దనుకునేవారికి రూ.లక్ష చొప్పున ఇంతకుముందే ప్రకటిం చిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా పరిహారం తాజాగా నిర్వాసిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ఆరంభమైంది. వాస్తవానికి దీనికోసమే కళ్ళల్లో ఒత్తులేసుకుని వేలాది మంది ఎదురు చూశా ు. ముంపు మండలాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడానికి రంగం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం పూర్తిగా చొరవ తీసుకుని నిర్వాసిత కుటుంబాలకు మొదటి నుంచి చెబుతున్నట్టుగానే వ్యక్తిగత పరిహారం చెల్లింపు దిశగా తమ పూర్తి మద్దతు ఇచ్చినట్టయ్యింది. ప్రత్యేకంగా గిరిజన, గిరిజనేతర కుటుంబాలు వ్యక్తిగత పరిహారం విషయంలో వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికలు వచ్చిన ప్రతీసారి చెలగాటమాడాయి. కాని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నేతృత్వంలో పోలవరం పూర్తి చేయాలన్న తపన, లక్ష్యంతో దీనికి సమాంతరంగా నిర్వాసిత కుటుంబాలకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో రాజీ పడకుండా చొరవ చూపినట్టయ్యింది. ప్రత్యేకించి తాజాగా వ్యక్తిగత పరిహారాన్ని బ్యాంకుల్లో జమ చేసేలా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. ఒక్క పోలవరం మండలంలోనే పరిహారం చెల్లింపునకు రూ.15 కోట్లకు పైగా నిధులు అందుబాటులోకి వచ్చాయి. కుక్కునూరు, వేలేరుపాడుల్లో దీనికి కాస్త రెట్టింపు సంఖ్యలోనే పరిహారం జమ చేయడం ఆరంభమైంది.
పరిహారంలో అప్పుడు జగన్నాటకాలెన్నో !
2019 ఎన్నికల్లోను, ఆ తర్వాత కూడా వైసీపీ వ్యక్తిగత పరిహారం పేరిట తెగ నాటకాటకాలాడారు. ఓట్లు దండుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. 2019లో ఈ నాటకాలకు లొంగిన అనేకమంది వైసీపీ పక్షాన నిలిచి అప్పట్లో పోలవరంలో తిరుగులేని మెజార్టీ వైసీపీకి కట్టబెట్టారు. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా వ్యక్తిగత పరిహారం రూ.పది లక్షలకు పెంచుతామని వైసీపీ ప్రభుత్వం గొప్పలకు పోయిం ది. 2024 ఎన్నికలకు ఆరు నెలలు ముందే మరోసారి పరిహారం పెంచి ఆ సొమ్ము అంతా జమ చేస్తున్నట్టుగా ఒకరిద్దరి ఖాతాల్లోనే వేసి మిగతా వారిని వలలో వేసుకునే ప్రయత్నాలు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మం డలాల్లో అప్పుడు సీఎం హోదాలో జగన్ పర్యటనకు వచ్చినప్పుడు నిర్వాసితులు ఎవరూ రెచ్చిపోకుండా జాగ్రత్తలు పడ్డారు. వైసీపీ పాలన ఐదేళ్లు నిర్వాసిత కుటుంబాలతో చెలగాటమాడారు. ఎవరికీ పరిహారం అందకపోగా ఇదంతా ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి వైసీపీ పన్నాగంగా గమనించి 2024 ఎన్నికల్లో వైసీపీకి చుక్కలు చూపించారు.
41.15 కాంటూరు పరిధిలోనే..
పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు లెవెల్‌లోనే ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని ఇళ్లకు వ్యక్తిగత పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయా మండలాల్లో పునరావాస జాబితాలో ఉన్న కుటుంబాల్లో పరిహారం చెల్లింపును ఆరంభించారు. నిర్వాసిత కుటుంబాలకు చాలాకాలం తర్వాత పరిహారం బ్యాంకుల్లో జమ అవ్వడం దాదాపు ఇదే ప్రథమం. కుక్కునూరు మండలం కుక్కునూరు ‘ఎ’ బ్లాక్, కివ్వాక, చీరవల్లి, దామరచర్ల, గుంపేనపల్లి, రామచంద్ర పురం ముంపు గ్రామాల్లో నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అయ్యింది. వేలేరుపాడు మండలం వేలేరుపాడు, రేపాకగొమ్ము, జగన్నాఽథపురం, నడిమిగొమ్ము, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో నిర్వాసితుల ఖాతాల్లో జమ అయ్యింది. పోలవరం కాంటూరు లెవెల్ కేవలం 41.15 పరిధిలోకి వచ్చే ముంపు గ్రామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లింపు దిశగా అడుగులు వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి లెవెల్ 45.75 కాంటూరు లెవెల్‌లో పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు కొత్త ప్రశ్నగా మారింది. అయితే ముందస్తుగా దఫాల వారీగా పరిహారం చెల్లించడం కొంతలో కొంత నిర్వాసిత కుటుంబాలను ఆదుకున్నట్టవుతుంది. ఈ దిశగానే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పాలాభిషేకాలు చేశారు. నిర్వాసిత గ్రామాల్లో అనేకమంది ఆనందం పట్టలేక నృత్యాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వెయ్యినోళ్ళ పొగిడారు.
పరిహారం చెల్లింపు
చంద్రబాబుకే సాధ్యం
గతంలో భూములకు పరిహారం ఇచ్చిన ఘనత చంద్రబాబుది. మళ్లీ నిర్వాసితులందరికి అన్ని రకాల పరిహారం అందించ డం చంద్రబాబుకే ఘనత దక్కింది. ఎన్నో ఏళ్ళుగా నిర్వాసితులకు పరిహారం అందక బాధ అనుభవిస్తున్నారు. ఇప్పుడు పరిహారం అందడంతో నిర్వాసితులకు మేలు జరుగుతుంది. చంద్రబాబుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– ములిశెట్టి నాగేశ్వరరావు, టీడీపీ కుక్కునూరు మండలాధ్యక్షుడు
నిర్వాసితులకు పవన్ తోడ్పాటు
నిర్వాసితుల సమస్యల ను ఎమ్మెల్యే చిర్రి బాల రాజు ద్వారా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన తోడ్పా టుతో ఈ రోజు నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ అవుతోంది. గత ప్రభుత్వం నిర్వాసితులను ఏ మాత్రం పట్టించుకోలేదు. పరిహారం జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది.
– ఎం.యుగంధర్, జనసేన కుక్కునూరు మండల పార్టీ అధ్యక్షుడు
న్యాయం జరిగింది..
నా బ్యాంకు ఖాతాలో వ్యక్తిగత పునరావాస పరి హారం కింద రూ.6లక్షల 36 వేలు జమ అయ్యింది. 2022 గోదావరి వరదలకు మా ఇల్లు మొత్తం కొట్టుకుపోవడంతో రెండేళ్లుగా పునరావాస కాలనీలోనే నివాసం ఉంటున్నాను. అప్పటి నుంచి ప్యాకేజీల కోసం ఎదురు చూస్తున్నాం. ఇన్ని రోజుల తర్వాత మాకు పరిహారం అందడంతో న్యాయం జరిగింది.
– పటాన్ వల్లిబాషా, కుక్కునూరు,‘ఏ ’ బ్లాక్ నిర్వాసితుడు
ఏళ్ల తరబడి బాధ పడుతున్నాం
నేను కుక్కునూరు ఏ.బ్లాక్ నిర్వాసితుడిని. ఏటా గోదావరి వరదలు రావడం ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కాలనీకి వెళ్ళాల్సి వస్తోంది. మళ్ళీ గోదావరి వరదలు తగ్గిన తర్వాత ఇంటికి వస్తున్నాం. ఈ క్రమంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. ఏళ్ళ తరబడి ఇక్కడ ప్రతీ నిర్వాసితుడు బాధలకు గురవుతున్నవాడే. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది నిర్వాసితులకు మేలు జరుగుతోంది.
– పిచ్చుక రాజు, ఉప సర్పంచ్, కుక్కునూరు