Share News

PMGSY Road: పీఎంజీఎస్‌వై రహదారుల నిర్వహణకు 43 కోట్లు

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:40 AM

ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 1,177 రోడ్ల పనులకు, 142 వంతెనలకు సాధారణ నిర్వహణ...

PMGSY Road: పీఎంజీఎస్‌వై రహదారుల నిర్వహణకు 43 కోట్లు

అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద 1,177 రోడ్ల పనులకు, 142 వంతెనలకు సాధారణ నిర్వహణ కోసం రూ.43.32 కోట్లను మంజూరుచేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2024-25 సంవత్సరానికిగాను, 3417 కి.మీ మేర 596 రోడ్ల నిర్వహణకు రూ.19.14 కోట్లు, 113 వంతెనలకు సంబంధించి 6557 మీటర్ల నిర్వహణకు రూ.1.55 కోట్లు వెరసి మొత్తం 709 పనులకు రూ.20.70 కోట్లు మంజూరుచేశారు. 2025-26 సంవత్సరానికి.. 581 రోడ్లకు రూ.21.76 కోట్లు, 29 వంతెనల నిర్వహణకు రూ.85లక్షలు.. వెరసి రూ.22.62 కోట్లు మంజూరుచేస్తూ ఆదేశాలిచ్చారు.

Updated Date - Sep 04 , 2025 | 03:40 AM