PM Modi: థ్యాంక్స్ నాయుడూ...
ABN , Publish Date - Jan 09 , 2025 | 03:56 AM
‘థ్యాంక్స్ నాయుడూ’ అంటూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని..
తన ప్రసంగాన్ని అనువదించినందుకు... రామ్మోహన్‌నాయుడికి మోదీ అభినందన
శ్రీకాకుళం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘థ్యాంక్స్ నాయుడూ’ అంటూ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడిని ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని.. బుధవారం సాయంత్రం వేదికపై మాట్లాడుతుండగా.. ఆ ప్రసంగాన్ని తెలుగులోకి రామ్మోహన్‌నాయుడు అనువదించారు. దీనిపై ప్రజలనుంచి అద్భుత స్పందన లభించింది. ఈనేపథ్యంలో ప్రధాని సభ ముగించుకుని తిరుగు పయనమవుతూ.. రామ్మోహన్‌నాయుడి భుజంపై చేయివేసి ప్రత్యేకంగా అభినందించారు.