Share News

మొక్కుబడిగా సర్వసభ్య సమావేశం

ABN , Publish Date - Feb 26 , 2025 | 12:15 AM

స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు డుమ్మా కొట్టారు. గైర్హాజరైన అధికారులకు నోటీసులు అందిస్తామని ఎంపీడీఓ నటరాజ్‌ తెలిపారు

మొక్కుబడిగా సర్వసభ్య సమావేశం
సమావేశంలో ఖాళీగా ఉన్న కుర్చీలు

కొత్తచెరువు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సాధారణ సర్వసభ్య సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు డుమ్మా కొట్టారు. గైర్హాజరైన అధికారులకు నోటీసులు అందిస్తామని ఎంపీడీఓ నటరాజ్‌ తెలిపారు. ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.... గతంలో జరిగిన సర్వసభ్య సమావేశాల్లో పలు సమస్యలపై ఫిర్యాదు చేశామని, ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని, ఇక సమావేశాలు నిర్వహించడం ఎందుకని ఎంపీడీఓను నిలదీశారు. ఎంపీటీసీ రఫీ మాట్లాడుతూ.. హౌసింగ్‌ ఏఈ వెంకటేశ నాయక్‌, సిబ్బంది ఆ కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉండటం లేదని, కనీసం ఫోన చేసినా లిఫ్ట్‌ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. అనేక మంది రోజుల తరబడి ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, కనీసం మూడు రోజులకు ఒకసారైనా ఆఫీ్‌సకు వస్తే.. ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ ... విధులను నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హౌసింగ్‌ ఏఈకి ఆదేశించారు.

Updated Date - Feb 26 , 2025 | 12:19 AM