Sadabharghavi: గిరిజన కళాకారుల మెరుగైన జీవనోపాధికి కృషి
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:37 AM
గిరిజన సంస్కృతిలోని సుందరమైన కళలకు మంచి గుర్తింపును తీసుకురావడానికి, కళాకారులకు మెరుగైన జీవనోపాధి..
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంస్కృతిలోని సుందరమైన కళలకు మంచి గుర్తింపును తీసుకురావడానికి, కళాకారులకు మెరుగైన జీవనోపాధి కల్పించడానికి తగిన ప్రణాళికలు రూపొందించనున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదాభార్గవి తెలిపారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఐటీడీఏ పరిధిలోని గిరిజన కళాకారులు, చేతివృత్తి కళాకారులు, సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు.