Share News

Payyavula Keshav: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:33 AM

పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన జీఎస్టీ సమాచారం పరస్పరం అందుబాటులో ఉంటే.. పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి వీలవుతుందని...

Payyavula Keshav: పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలి

  • జీఎస్టీపై ఆర్థిక మంత్రుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న పయ్యావుల కేశవ్‌

అనంతపురం కలెక్టరేట్‌, జూలై4 (ఆంధ్రజ్యోతి): పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన జీఎస్టీ సమాచారం పరస్పరం అందుబాటులో ఉంటే.. పన్ను ఎగవేతదారులను కట్టడి చేయడానికి వీలవుతుందని, ఏపీ తరఫున తాను ఇదే కోరుకుంటున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్త జీఎస్టీ సరళిని పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయింది. ఈ సమావేశానికి పయ్యావుల అనంతపురం కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. తమ రాష్ట్రంలో జీఎస్టీ వసూలు, పన్ను ఎగవేతదారులపై నిబంధనల మేరకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఏపీలో జీఎస్టీ అమలు తీరు, అనుసరిస్తున్న మెరుగైన విధానాల గురించి వివరించారు. ఏఐ ఆధారిత యాప్‌ జీఎస్టీ అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 05:34 AM