Share News

National Panchayati Raj Day: నేడు పంచాయతీరాజ్‌ దినోత్సవం

ABN , Publish Date - Apr 24 , 2025 | 04:49 AM

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా, పవన్‌కల్యాణ్‌ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్లో ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన పంచాయతీ అవార్డులు గ్రహీతలకు ఆయన పురస్కారాలు అందించనున్నారు.

National Panchayati Raj Day: నేడు పంచాయతీరాజ్‌ దినోత్సవం

మంగళగిరిలో పురస్కారాలు అందజేయనున్న ఉప ముఖ్యమంత్రి

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌, పంచాయతీరాజ్‌ విభాగాలు, గ్రామీణాభివృద్ధిశాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం, సోషల్‌ ఆడిట్‌, ఎస్‌ఐఆర్‌డీ, జాతీయ పంచాయతీ అవార్డు-2024 గ్రహీతలకు ఆయన పురస్కారాలు అందిస్తారు. పంచాయతీరాజ్‌లో భాగస్వాములైన గ్రామీణ స్థానికసంస్థల ప్రతినిధులు 994 మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 04:49 AM